మ్యాంగో డిలైట్

ABN , First Publish Date - 2022-06-04T20:06:04+05:30 IST

మామిడి పండు ముక్కలు - రెండు కప్పులు, చక్కెర - కప్పు, మొక్కజొన్న పిండి - కప్పు, నీళ్లు -

మ్యాంగో డిలైట్

కావలసిన పదార్థాలు: మామిడి పండు ముక్కలు - రెండు కప్పులు, చక్కెర - కప్పు, మొక్కజొన్న పిండి - కప్పు, నీళ్లు - మూడు కప్పులు, నెయ్యి - 4 స్పూన్లు ఎండు కొబ్బరి తురుము - నాలుగు స్పూన్లు.


తయారుచేసే విధానం: ముందుగా మామిడి ప్యూరీ చేసుకోవాలి. పెద్ద గిన్నెలో ప్యూరీ, నీళ్లు, చక్కెర, మొక్కజొన్న పిండి బాగా కలపాలి. బాణాలిలో ఈ మిశ్రమాన్ని వేసి సన్నని మంటమీద ఉడికించాలి. అయిదు నిమిషాల తరవాత రెండు స్పూన్ల నెయ్యి జతచేయాలి. మొత్తం దగ్గరగా అవుతుంటే మిగతా నెయ్యిని కలపాలి. మరింత దగ్గరయ్యాక ఓ వెడల్పాటి పళ్లెంలోకి వంపుకుని స్టవ్ కట్టేయాలి. రెండు గంటలపాటు చల్లారనివ్వాలి. ఆ తరవాత చాకుతో ఇష్టమైన ఆకారంలో ముక్కలుగా కోయాలి. ఒక్కో బిళ్లని ఎండు కొబ్బరిలో అద్దితే మ్యాంగో డిలైట్ సిద్ధం.

Read more