New Year Celebrations: కొత్త ఏడాదిని వేడుకగా ఆహ్వానిద్దాం!

ABN , First Publish Date - 2022-12-30T21:28:31+05:30 IST

కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టడానికి మరొకొన్ని గంటలే మిగిలి ఉన్నాయి. కుటుంబ సభ్యులు, స్నేహితులతో

New Year Celebrations: కొత్త ఏడాదిని వేడుకగా ఆహ్వానిద్దాం!
Celebrations

హైదరాబాద్: కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టడానికి మరొకొన్ని గంటలే మిగిలి ఉన్నాయి. కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి నూతన సంవత్సరాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి మించిన ఆనందం ఏముంటుంది. ఈ ఏడాది ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఎన్నో మధురస్మృతులు మిగిలే ఉంటాయి. వేటికవే ప్రత్యేకం. ఇప్పుడు వాటన్నింటినీ కలిపి ఒకేసారి వేడుక చేసుకునే సమయం రానే వచ్చింది.

వేడుక ఏదైనా విందు ఉండాల్సిందే. మరి అలా తీసుకునే విందు మన ఆరోగ్యానికి ఎలాంటి చేటు చేయకూడదు. కాబట్టి ఎలాంటి డిషెస్‌తో విందు చేసుకోవాలనే అంశంపై ‘గోల్డ్ డ్రాప్’ సేల్స్ అండ్ మార్కెటింగ్ డైరెక్టర్ మితేష్ లోహియా మాట్లాడుతూ.. సంతోషకరమైన సంభాషణలను ప్రారంభించడానికి స్వీట్లు ఉండాల్సిందేనని చెప్పుకొచ్చారు. వీటితోపాటు కొత్త ఉత్సాహం ఉరకలెత్తే వేళ కొంచె హాట్‌‌హాట్‌గా మురుకులు, కలోంజీ , సుమాక్‌ లాంటి డిషెస్‌ను పక్కన పెట్టుకోవచ్చంటారు మితేష్ లోహియా.

నిజానికి పార్టీలంటే కాక్‌టైల్స్ మాత్రమే కాదు. మాక్ టైల్స్‌తోనూ మజా చేసుకోవచ్చు. జామపండు జ్యూస్‌, టమోటా జ్యూస్‌ వెరైటీలతో కాస్తంత కొత్తిమీర, జీలకర్ర పొడితో ఈ మాక్‌టైల్‌ మజా అందిస్తుంది. పార్టీ మజా ప్రారంభించడానికి కరకరలాడే చిప్స్‌ ఉండాల్సిందే. ఎప్పటిలా బంగాళా దుంప చిప్స్‌ కాకుండా ఈసారి అరటితో ట్రై చేయండి. వెరైటీ టేస్ట్‌తో బ్రహ్మాండంగా ఉంటాయి. ఈ చిప్స్‌లో ప్రయోగాలు చేయాలనుకుంటే బిండీ పాప్‌కార్న్‌ ఉంది. కేవలం నిమిషాల వ్యవధిలోనే బెండకాయ, కాస్త శనగపిండి, పసుపు, కారం, ఉప్పుతో ఈ పాప్‌కార్న్‌ చేసుకోవచ్చు!

పార్టీ అంటే ముక్కలేకుండా ఎలా అన్నది మరికొందరి ప్రశ్న. కాబట్టి ఇలాంటి వారి కోసం చికెన్‌ లేదంటే చేప ఉండనే ఉంది. పార్టీలలో వేపుళ్లకే క్రేజ్ కాబట్టి వీటిని డీప్‌ ఫ్రై లేదంటే వోక్‌తో అయినా చేసుకోవచ్చు. కాకపోతే వాటి కోసం వాడే నూనెల విషయంలో కాస్తంత జాగ్రత్తగా ఉండాలి. సూపర్ రిఫైండ్‌గా ఖ్యాతిగాంచిన గోల్డ్‌డ్రాప్ లాంటి నూనె అయితే తేలికగా ఉండటంతో పాటుగా వాసన లేకుండా ఉంటుంది. అంతేకాదు, తక్కువగా పీల్చుకునే స్వభావం ఉంటుంది కాబట్టి రుచికి చక్కని భరోసా ఇస్తుంది.

శాకాహారుల కోసం సుందాల్‌ ఉంది. శనగపప్పు, రాజ్మా లేదంటే గ్రీన్‌ పీస్‌తో దీనిని తయారుచేస్తారు. ఉల్లిపాయ లేదంటే వెల్లుల్లి లేకుండా కొబ్బరి, స్పైసెస్‌ ఉపయోగించి దీనిని ఫ్రై చేస్తారు. పక్కనే పాపడ్‌ కూడా ఉంటే మరింత హ్యాపీ. మెయిన్‌ కోర్సు దగ్గరకు వచ్చేసరికి శాకాహారం లేదంటే చికెన్‌, మటన్‌ బిర్యానీ ఉండాల్సిందే ! ఈ బిర్యానీలలో కాస్త శాఫ్రాన్‌, రోజ్‌ వాటర్‌ లాంటివి జోడిస్తే రాయల్‌ టచ్‌ ఇవ్వొచ్చు. సంతోషకరమైన విందు ముగిసిన తరువాత డెసర్ట్స్‌ లేకపోతే ఎలా? కొబ్బరి లడ్డూలు పార్టీకి ప్రత్యేకతను తీసుకొస్తాయి. యాలికలు, కొబ్బరి లేదంటే వైవిధ్యత కోసం చాక్లెట్‌ ఫుడ్జ్‌ బ్రౌనీ కలిపి వీటిని చేసుకోవచ్చు.

ఈ తరహా వైవిధ్యమైన డిషెస్‌తో నూతన సంవత్సరాన్ని స్వాగతించడానికి సిద్ధం కావాలని, కుటుంబ సభ్యులు, స్నేహితులతో ఉల్లాసంగా గడపాలని మితేష్ లోహియా ఆకాంక్షించారు.

Updated Date - 2022-12-30T21:28:31+05:30 IST

Read more