బెండకాయ పెరుగు కర్రీ

ABN , First Publish Date - 2022-04-23T18:50:21+05:30 IST

పెరుగు - రెండు కప్పులు, బెండకాయలు - పావుకేజీ, ఉల్లిపాయలు - రెండు, కారం - ఒక టీస్పూన్‌, పసుపు - ఒక టీస్పూన్‌ , ధనియాల పొడి - ఒక టీస్పూన్‌, జీలకర్రపొడి

బెండకాయ పెరుగు కర్రీ

కావలసినవి: పెరుగు - రెండు కప్పులు, బెండకాయలు - పావుకేజీ, ఉల్లిపాయలు - రెండు, కారం - ఒక టీస్పూన్‌, పసుపు - ఒక టీస్పూన్‌ , ధనియాల పొడి - ఒక టీస్పూన్‌, జీలకర్రపొడి - ఒక టీస్పూన్‌, ఆవాలు - ఒక టీస్పూన్‌, కరివేపాకు - రెండు రెమ్మలు, పచ్చిమిర్చి - రెండు, నూనె - సరిపడా, ఉప్పు - తగినంత.


తయారీ విధానం: స్టవ్‌పై పాన్‌ పెట్టి రెండు టేబుల్‌స్పూన్ల నూనె వేసి వేడి అయ్యాక ఉల్లిపాయలు వేసి వేయించాలి. తరువాత పొడవుగా తరిగిన బెండకాయలు వేసి చిన్నమంటపై వేయించాలి.పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్రపొడి, తగినంత ఉప్పు వేసి కలుపుకొని మరికాసేపు వేయించాలి. ఇప్పుడు పెరుగు వేసి బెండకాయ ముక్కలకు పట్టేలా కలుపుకోవాలి. ఐదు నిమిషాల పాటు వేయించి దింపుకోవాలి. స్టవ్‌పై మరో పాన్‌ పెట్టి కొద్దిగా నూనె వేసి వేడి అయ్యాక పచ్చిమిర్చి, కరివేపాకు, ఆవాలు వేసి వేయించాలి. ఈ పోపు మిశ్రమాన్ని బెండకాయ కర్రీలో కలుపుకోవాలి. వేడి వేడిగా రోటీతో సర్వ్‌ చేసుకోవాలి. 


Read more