కడి

ABN , First Publish Date - 2022-04-30T17:40:05+05:30 IST

శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యానికి మంచి ఆహారం అవసరం. అలాంటి సాత్వికాహారానికి సంబంధించిన కొన్ని వంటల విశేషాలను ఈశా ఫౌండేషన్‌ పుస్తకరూపంలో

కడి

ఆరోగ్యానికి... సులువైన పులుసులు

శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యానికి మంచి ఆహారం అవసరం. అలాంటి సాత్వికాహారానికి సంబంధించిన కొన్ని వంటల విశేషాలను ఈశా ఫౌండేషన్‌ పుస్తకరూపంలో తీసుకొచ్చింది. అందులోని కొన్ని రుచికరమైన పులుసుల తయారీ విశేషాలు మీకోసం...


కావలసినవి: శనగపిండి - 200గ్రా, పెరుగు - అర లీటరు, దాల్చిన చెక్క - చిన్నముక్క, లవంగాలు - నాలుగైదు, ఎండుమిర్చి - మూడు, గరంమసాల - అరటీస్పూన్‌, ఉప్పు - తగినంత, పసుపు - పావు టీస్పూన్‌, కరివేపాకు - ఒక రెమ్మ, మెంతులు - అర టీస్పూన్‌, నూనె - రెండు టీస్పూన్లు.


తయారీ విధానం: ఒక లీటరు నీటిలో పెరుగు, శనగపిండి వేసి బాగా కలియబెట్టాలి. స్టవ్‌పై బాణలి పెట్టి నూనె వేసి కాస్త వేడి అయ్యాక ఎండుమిర్చి, కరివేపాకు, మెంతులు, పసుపు, లవంగాలు, దాల్చినచెక్క, గరంమసాల వేయాలి. తరువాత పెరుగు పోయాలి. ఐదు నిమిషాల పాటు మరిగించుకోవాలి. తగినంత ఉప్పు వేసి దింపుకోవాలి.

Updated Date - 2022-04-30T17:40:05+05:30 IST