చక్కెర పొంగల్‌

ABN , First Publish Date - 2022-01-08T17:27:51+05:30 IST

బియ్యం - ఒక కప్పు, పెసరపప్పు - పావు కప్పు, బెల్లం - ఒక కప్పు, జీడిపప్పు - రెండు టేబుల్‌స్పూన్లు, ఎండుద్రాక్ష

చక్కెర పొంగల్‌

కావలసినవి: బియ్యం - ఒక కప్పు, పెసరపప్పు - పావు కప్పు, బెల్లం - ఒక కప్పు, జీడిపప్పు - రెండు టేబుల్‌స్పూన్లు, ఎండుద్రాక్ష - ఒక టేబుల్‌స్పూన్‌, తినే కర్పూరం - చిటికెడు, యాలకుల పొడి - పావు టీస్పూన్‌, నెయ్యి - అర కప్పు, నీళ్లు - తగినన్ని.


తయారీ విధానం: స్టవ్‌పై పాన్‌ పెట్టి పెసరపప్పును డ్రై రోస్ట్‌ చేయాలి. చల్లారిన తరువాత పప్పును శుభ్రంగా కడగాలి. బియ్యాన్ని కూడా శుభ్రంగా కడిగి పప్పుతో పాటు కుక్కర్‌లో వేసి మూడు విజిల్స్‌ వచ్చే వరకు ఉడికించాలి. తరువాత స్టవ్‌పై మళ్లీ పాన్‌ పెట్టి వేడి అయ్యాక బెల్లం వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడికించాలి. బెల్లం కరిగి చిక్కగా అయిన తరువాత స్టవ్‌ ఆర్పేయాలి.  కుక్కర్‌లో ఉడికించుకున్న బియ్యం, పప్పును పప్పు గుత్తితో రుబ్బుకోవాలి. తరువాత బెల్లం పానకం వేయాలి. యాలకుల పొడి వేసి ఈ మిశ్రమాన్ని చిన్న మంటపై కాసేపు ఉడికించి దింపుకోవాలి.  స్టవ్‌పై మరో పాన్‌ పెట్టి కొద్దిగా నెయ్యి వేసి జీడిపప్పు వేయించాలి. ఈ జీడిపప్పును, ఎండుద్రాక్ష, తినే కర్పూరాన్ని పొంగల్‌లో కలుపుకొని సర్వ్‌ చేసుకోవాలి.

Read more