దాల్‌ మఖాని

ABN , First Publish Date - 2022-04-16T21:27:16+05:30 IST

మినుములు - 200గ్రా, పెసర్లు - 100గ్రా, టొమాటో ప్యూరీ - 400గ్రా, అల్లంవెల్లుల్లి పేస్టు - 25గ్రా, వెన్న - 50గ్రా, ఫ్రెష్‌ క్రీమ్‌ - 40గ్రా, కసూరీ మేతి - 5గ్రా, ఉప్పు - రుచికి తగినంత.

దాల్‌ మఖాని

కావలసినవి: మినుములు - 200గ్రా, పెసర్లు - 100గ్రా, టొమాటో ప్యూరీ - 400గ్రా, అల్లంవెల్లుల్లి పేస్టు - 25గ్రా, వెన్న - 50గ్రా, ఫ్రెష్‌ క్రీమ్‌ - 40గ్రా, కసూరీ మేతి - 5గ్రా, ఉప్పు - రుచికి తగినంత.


తయారీ విధానం: రాత్రి మినుములు, పెసర్లను నానబెట్టుకోవాలి. ఉదయాన్నే వాటిని శుభ్రంగా కడిగి ప్రెషర్‌ కుక్కర్‌లో వేసి మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి.తరువాత అందులో అల్లంవెల్లుల్లి పేస్టు, టొమాటో ప్యూరీ, వెన్న వేసి మరికాసేపు ఉడికించాలి.ఇప్పుడు కొద్దిగా ఫ్రెష్‌ క్రీమ్‌, కసూరీ మేతి, తగినంత ఉప్పు వేసి కలుపుకొని ఉడికించుకోవాలి.బౌల్‌లోకి మార్చుకుని మిగిలిన క్రీమ్‌తో గార్నిష్‌ చేసుకుని సర్వ్‌ చేసుకోవాలి.


Read more