క్యాప్సికమ్‌- బ్రొకోలి సబ్జీ

ABN , First Publish Date - 2022-05-04T18:23:41+05:30 IST

బ్రొకోలీ - కప్పు, క్యారెట్‌ ముక్కలు - అర కప్పు, క్యాప్సికమ్‌- కప్పు, ఆవాలు- స్పూను, కరివేపాకు- రెండు రెబ్బలు, ఇంగువ- చిటికెడు, మిరియాల పొడి- స్పూను, ఉల్లి ముక్కలు

క్యాప్సికమ్‌- బ్రొకోలి సబ్జీ

కావలసిన  పదార్థాలు: బ్రొకోలీ - కప్పు, క్యారెట్‌ ముక్కలు - అర కప్పు, క్యాప్సికమ్‌- కప్పు, ఆవాలు- స్పూను, కరివేపాకు- రెండు రెబ్బలు, ఇంగువ- చిటికెడు, మిరియాల పొడి- స్పూను, ఉల్లి ముక్కలు- అర కప్పు, టొమాటో ముక్కలు- కప్పు, పచ్చి మిరప- ఒకటి, అల్లం- కొద్దిగ, వెల్లుల్లి రెబ్బలు- 4, ఉప్పు, నీళ్లు, నూనె- తగినంత.


తయారుచేసే విధానం: బాణలిలో కాస్త నూనె వేసి ఆవాలను చిటపటలాడించాలి. ఇంగువ, కరివేపాకు, అల్లం, వెల్లుల్లీ జతచేయాలి. ఉల్లి ముక్కల్నీ కలిపి రంగు మారే వరకు వేయించాలి. ఆ తరవాత టొమాటో, మిర్చి ముక్కలూ, ఉప్పు కలపాలి. అంతా దగ్గరయ్యాక క్యారెట్‌, క్యాప్సికమ్‌ ముక్కలూ వేసి, కాస్త నీళ్లు చిలకరించి మూత పెట్టి అయిదు నిమిషాల పాటు మగ్గించాలి. బ్రొకోలీ కూడా కలిపి ఉప్పు, మిరియాల పొడి జతచేసి మరో అయిదు నిమిషాలు మూత పెట్టి మగ్గిస్తే క్యాప్సికమ్‌- బ్రొకోలీ సబ్జీ సిద్ధం.

Read more