కేసీఆర్‌ది దిక్కుమాలిన పాలన

ABN , First Publish Date - 2022-06-07T08:44:20+05:30 IST

కేసీఆర్‌ది దిక్కుమాలిన పరిపాలనని వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల మండిపడ్డారు. ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా ఆమె

కేసీఆర్‌ది దిక్కుమాలిన పాలన

వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల 


కొణిజర్ల / వైరా, జూన్‌ 6 : కేసీఆర్‌ది దిక్కుమాలిన పరిపాలనని వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల మండిపడ్డారు. ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా ఆమె సోమవారం ఖమ్మం జిల్లా కొణిజర్ల, వైరా మండలాల్లో పర్యటించారు. కొణిజర్ల మండలం పెద్దరామపురంలో ప్రారంభమైన పాదయాత్ర లక్ష్మీపురం, మంగాపురం, మేకాలకుంట, తీగలబంజర, లాలాపురం, పల్లిపాడు మీదుగా వైరా మండలంలోకి ప్రవేశించింది. పలు గ్రామాల్లో జరిగిన సభల్లో ఆమె ప్రసంగించారు. కేసీఆర్‌ పాలనలో రైతులకు భరోసా లేకుండా పోయిందన్నారు.


లాలాపురం వద్ద ఆమెను కలిసిన కొందరు రైతులు తుమ్మలచెరువు ఆక్రమణ, అందులో అధికార పార్టీ నాయకుడి ప్రమేయం గురించి వివరించారు. చెరువులను కబ్జాచేస్తుంటే అధికార యంత్రాంగం ఏం చేస్తుందని షర్మిల ప్రశ్నించారు.  రాష్ట్రంలో బాలికలు, మహిళల మానప్రాణాలు కాపాడలేని సీఎం కేసీఆర్‌ ఉరివేసుకొని చచ్చిపోవాలని వైరాలో సభలో షర్మిల అన్నారు. ఎందుకు పాదయాత్ర చేస్తున్నారని ప్రశ్నిస్తున్న కేటీఆర్‌ ఒక్కరోజు తనతో పాదయాత్ర చేస్తే సమస్యలను చూపిస్తానన్నారు. 

Read more