తెలంగాణ బాగు కోసమే వైఎస్సార్‌టీపీ: షర్మిల

ABN , First Publish Date - 2022-03-17T02:57:28+05:30 IST

తెలంగాణ ప్రజల బాగు కోసమే వైఎస్సార్ తెలంగాణ పార్టీ ఆవిర్భవించిందని ఆ

తెలంగాణ బాగు కోసమే వైఎస్సార్‌టీపీ: షర్మిల

యాదాద్రి: తెలంగాణ ప్రజల బాగు కోసమే వైఎస్సార్ తెలంగాణ పార్టీ ఆవిర్భవించిందని ఆ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల  అన్నారు. ప్రజాప్రస్థానం యాత్రలో భాగంగా ఆమె వలిగొండ మండలం సంగెం గ్రామస్తులతో మాటా ముచ్చట నిర్వహించారు.  ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు బాగుపడాలంటే పాలకపక్షం బాగుండాలన్నారు. కేసీఆర్ నియంత పాలన పోవాలన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే వారందరూ కేసీఆర్‌కి అమ్ముడుపోయారని, ఇది రాజకీయ వ్యభిచారం కాదా అని ఆమె ప్రశ్నించారు. తెలంగాణలో సంక్షేమ పాలన తీసుకు రావడమే వైఎస్సార్‌టీపీ లక్ష్యమని ఆమె పేర్కొన్నారు. 

Read more