27వ రోజుకు చేరుకున్న వైఎస్ షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర

ABN , First Publish Date - 2022-03-16T12:48:00+05:30 IST

భువనగిరి నియోకవర్గంలో వైఎస్ షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర 27వ రోజకు చేరుకుంది. 26వ రోజైన మంగళవారం ఆమె యాదాద్రి భువనగిరి

27వ రోజుకు చేరుకున్న వైఎస్ షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర

యాదాద్రి: భువనగిరి నియోకవర్గంలో వైఎస్ షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర 27వ రోజకు చేరుకుంది. 26వ రోజైన మంగళవారం ఆమె యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం బూర్లగడ్డలో పాదయాత్ర చేశారు. నేడు యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం బూర్లగడ్డలో మొదలవుతుంది. నెమిలికాల్వ జంక్షన్‌, జైకేసారం క్రాస్‌, జల్‌కాల్వ, గోకారం, వర్కట్‌పల్లి, సంగం మీదుగా సాగి భూదాన్‌పోచంపల్లి మండలం ధర్మారెడ్డిపల్లి, సలోనిగూడెం క్రాస్‌రోడ్‌ వద్ద ముగుస్తుంది. పాదయాత్ర అనంతరం సాయంత్రం సంగెం గ్రామస్తులతో షర్మిల మాటముచ్చట కార్యక్రమంలో పాల్గొననుంది.

Read more