29వ రోజు వైఎస్ షర్మిల ప్రజాప్రస్థానం

ABN , First Publish Date - 2022-03-18T21:26:07+05:30 IST

29వ రోజు వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర కొనసాగుతోంది. శుక్రవారం భూదాన్ పోచంపల్లి మండలం

29వ రోజు వైఎస్ షర్మిల ప్రజాప్రస్థానం

యాదాద్రి: 29వ రోజు వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర కొనసాగుతోంది. శుక్రవారం భూదాన్ పోచంపల్లి మండలం ముక్తాపురం, చింతబావి, రేవనపల్లెలో పాదయాత్ర కొనసాగుతోంది. సాయంత్రం బట్టుగూడ గ్రామస్తులతో షర్మిల మాటముచ్చట నిర్వహిస్తారు. భూదాన్‌పోచంపల్లి మండలంతో షర్మిల పాదయాత్ర కొనసాగుతోంది. గురువారం మండలంలోని దంతూరు, శివారెడ్డిగూడెం క్రాస్‌రోడ్డు, జిబ్లక్‌పల్లి, కనుముకుల, భీమనపల్లి మీదుగా భూదాన్‌పోచంపల్లి పట్టణాన్ని చేరుకుంది. మహిళలు భారీగా హాజరై కోలాటాలతో షర్మిలకు స్వాగతం పలికారు. నుదుట తిలకం దిద్ది మంగళహారతులతో మహిళలు స్వాగతించారు. భూదాన్‌పోచంపల్లి పట్టణంలోని ఆచార్య కొండా లక్ష్మణ్‌ బాపూజీ విగ్రహానికి ఆమె పూలమాలలు వేసి నివాళులర్పించారు.

Read more