Action Reaction: జగ్గారెడ్డిపై షర్మిల మళ్లీ ఘాటు వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2022-09-27T23:50:01+05:30 IST

ఎమ్మెల్యే జగ్గారెడ్డి Mla Jaggareddy)పై వైఎస్ షర్మిల (Ys Sharmila) మళ్లీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే జగ్గారెడ్డి టార్గెట్‎గా...

Action Reaction: జగ్గారెడ్డిపై షర్మిల మళ్లీ ఘాటు వ్యాఖ్యలు

సంగారెడ్డి (Sangareddy): ఎమ్మెల్యే జగ్గారెడ్డి Mla Jaggareddy)పై వైఎస్ షర్మిల (Ys Sharmila) మళ్లీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే జగ్గారెడ్డి టార్గెట్‎గా పాదయాత్రలో ఆమె ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. దీంతో జగ్గారెడ్డి కూడా అంతేస్థాయిలో రియాక్ట్ అయ్యారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డిని షర్మిల అవమానిస్తున్నారని జగ్గారెడ్డి వ్యాఖ్యలు చేస్తే  ఆయన పార్టీలు మారే వ్యక్తి అంటూ ఆమె కామెంట్స్ చేశారు. ఇలా రెండు రోజులుగా ఇద్దరి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తాజాగా షర్మిలపై జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను వ్యభిచారితో షర్మిల పోల్చడంపై ఆయన మండిపడ్డారు. అసలు షర్మిలకు బుద్ధి ఉందా అని.. అదే మాట తానేంటే ఎలా ఉంటుందని జగ్గారెడ్డి మండిపడ్డారు. 


 ‘‘షర్మిల హద్దుల్లో ఉండాలి. వైయస్ పరువు తీయొద్దు. షర్మిల పెద్ద మోతుబరి కాదు... అసలు ఆమె పంచాయితీ ఏంటో తెలియడం లేదు. ఆమె పాదయాత్ర ఎందుకు చేస్తుందనేది క్వశ్చన్ మార్క్. నన్ను కేటీఆర్ కోవర్ట్ అనడం దురదృష్టకరం. షర్మిల సీఎం కావాలనేది ఆమె కోరిక అని.. ఆమె తల్లి కూడా అదే చెప్పారు. షర్మిల ఏపీలో ఎందుకు తిరగడం లేదు. జగన్‌కు చెప్పి షర్మిలను ఏపీ సీఎం చేయాలని విజయమ్మకు సలహా ఇస్తున్నా. మీ కుటుంబ సభ్యులంతా సీఎంలుగా ఉండాలనేది మీ కోరిక. మీ ఇంటి పంచాయతీని మా మీద రుద్దకండి. ఏపీకి మూడు రాజధానుల బదులు మూడు రాష్ట్రాలు చేసుకోండి. మూడు రాష్ట్రాలకు మీ ముగ్గురు సీఎంలు కండి. మీకు ముఖ్యమంత్రి పదవుల కోసం రెండు రాష్ట్రాలను నాశనం చేస్తారా? వైయస్ బిడ్డ అని మిమ్మల్ని ఎవరు తిట్టలేక పోతున్నారు. షర్మిల పక్కా బీజేపీ ఏజెంట్, బీజేపీ బినామీ’’ అని జగ్గారెడ్డి  అన్నారు.


దీనికి కౌంటర్‎గా షర్మిల మాట్లాడుతూ ‘‘ఎమ్మెల్యే జగ్గారెడ్డి నన్ను బెదిరించాడట. ఇంకోసారి మాట్లాడితే బాగోదట. ఆయన ఛాలెంజ్‎కి భయపడేది కాదు ఈ వైఎస్ఆర్ బిడ్డ. ఈ జగ్గారెడ్డి చెప్తున్నవన్నీ పచ్చి అబద్ధాలు. వైఎస్సార్ చనిపోయిన రోజు జగ్గారెడ్డి పరామర్శకు వస్తే మేము రాజకీయాలు మాట్లాడామట. మేము బాధ పడలేదట.  ఆ రోజు మా కుటుంబం పడిన బాధ మాకే తెలుసు. అసలు మేము బతుకుతామా..చస్తమా అన్నట్లుగా బాధపడ్డాం. జగ్గారెడ్డికి ఏం తెలుసు. పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు. అసలు ఛాలెంజ్ చేయడానికి జగ్గారెడ్డి ఎవరు?. పాలమూరు ఎమ్మెల్యేలు అంతా నాపై స్పీకర్‎కి ఫిర్యాదు చేస్తేనే భయపడలేదు. మంత్రి FIR ఫైల్ చేస్తేనే భయపడలేదు. ఈ రాజశేఖర్ బిడ్డ.. ఎవడికి భయపడేది కాదు. దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయాలని సంకెళ్లు చూపించి సవాల్ విసిరా. ఇక్కడ ఉన్నది వైఎస్సార్ రక్తం.. పులి బిడ్డ. ఇక్కడున్నది వైఎస్సార్ ఊపిరి..వైఎస్సార్ ప్రాణం.’’ అని అన్నారు.


మరి వైఎస్ షర్మిల వ్యాఖ్యలకు మళ్లీ జగ్గారెడ్డి రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.

Updated Date - 2022-09-27T23:50:01+05:30 IST