మిర్యాలగూడలో వర్గాలుగా విడిపోయి దాడులు చేసుకున్న యువకులు

ABN , First Publish Date - 2022-05-18T14:19:22+05:30 IST

మిర్యాలగూడ పట్టణం నందిపాడు నవనీత వైన్స్ వద్ద యువకుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.

మిర్యాలగూడలో వర్గాలుగా విడిపోయి దాడులు చేసుకున్న యువకులు

నల్గొండ : మిర్యాలగూడ(Miryalaguda) పట్టణం నందిపాడు నవనీత వైన్స్ వద్ద యువకుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. కొందరు యువకులు రెండు వర్గాలుగా విడిపోయి మరీ ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. మద్యం మత్తులో బ్లేడ్లతో(Blade) ఒక వర్గంపై మరో వర్గం దాడికి పాల్పడింది. ఈ దాడిలో ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. ఏరియా ఆసుపత్రికి తరలించారు. రూరల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.


Read more