రాష్ట్రాన్నే పాలించడం రాదు.. దేశాన్ని ఏలుతారా?

ABN , First Publish Date - 2022-02-23T09:12:14+05:30 IST

రాష్ట్రాన్నే సరిగ్గా పాలించడం రాని కేసీఆర్‌..

రాష్ట్రాన్నే పాలించడం రాదు.. దేశాన్ని ఏలుతారా?

సీఎం కేసీఆర్‌పై షర్మిల వ్యాఖ్యలు

హైదరాబాద్‌, ఫిబ్రవరి 22 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రాన్నే సరిగ్గా పాలించడం రాని కేసీఆర్‌.. దేశాన్ని ఏలుతానని అనడం విడ్డూరంగా ఉందని వైఎ్‌సఆర్‌టీపీ అధినేత్రి షర్మిల ఎద్దేవా చేశారు. కేసీఆర్‌కు ఆ అర్హత ఉందా అని ఆమె ప్రశ్నించారు. లోట్‌సపాండ్‌లోని వైఎ్‌సఆర్‌టీపీ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం మీడియాతో మాట్లాడారు. ఒకప్పుడు స్కూటర్‌పై తిరిగిన కేసీఆర్‌.. ఇప్పుడు ప్రగతి భవన్‌లో ఆడంబరాలు అనుభవిస్తున్నారని, కానీ రైతులు, నిరుద్యోగుల బతుకులు మాత్రం ఉన్నచోటనే ఉండాలా అని పేర్కొన్నారు. బీజేపీ, టీఆర్‌ఎ్‌సలకు ఏమీ తేడా లేదని, తమ అవసరాల కోసం బీజేపీ మతాన్ని అడ్డు పెట్టుకుంటే.. సీఎం కేసీఆర్‌ తెలంగాణ సెంటిమెంట్‌ను అడ్డు పెట్టుకుంటోందని షర్మిల మండిపడ్డారు. కాగా, సంత్‌ సద్గురు సేవాలాల్‌ మహరాజ్‌ జయంతిని పురస్కరించుకుని లోటస్‌ పాండ్‌లో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో షర్మిల పాల్గొన్నారు.  

Read more