ఎన్నికల టికెట్లలో మహిళా కోటా: బండి సంజయ్‌

ABN , First Publish Date - 2022-03-16T09:17:44+05:30 IST

రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చని.. అందుకు సిద్ధంగా ఉండాలని మహిళా మోర్చా నేతలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పిలుపునిచ్చారు.

ఎన్నికల టికెట్లలో మహిళా కోటా: బండి సంజయ్‌

హైదరాబాద్‌, మార్చి 15 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చని.. అందుకు సిద్ధంగా ఉండాలని మహిళా మోర్చా నేతలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పిలుపునిచ్చారు. అసెంబ్లీ ఎన్నికల టికెట్లలో ఈసారి మహిళా కోటా ఉంటుందని.. దీనిని దృష్టిలో ఉంచుకుని కష్టపడి పనిచేయాలని సూచించారు. మంగళవారం రాత్రి 13 జిల్లాల మహిళా మోర్చా నేతలతో ఆయన వర్చువల్‌గా సమావేశం నిర్వహించారు. తెలంగాణలో ఈసారి బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. గెలిచే అవకాశం ఉన్న మహిళా నేతలకు తప్పకుండా టికెట్లు ఇచ్చి గెలిపించుకుంటామని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు ఇచ్చే విషయమై జాతీయ నాయకత్వం అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుంటుందని పేర్కొన్నారు.


Read more