మీటర్లు పెట్టమని ఎక్కడ చెప్పారు?

ABN , First Publish Date - 2022-09-13T10:09:17+05:30 IST

విద్యుత్‌ సవరణ బిల్లులో ఎక్కడా మీటర్లు పెట్టాలనే ప్రస్తావనే లేదని, సబ్సిడీల రద్దు కూడా లేదని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు అన్నారు.

మీటర్లు పెట్టమని ఎక్కడ చెప్పారు?

బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు

విద్యుత్‌ సవరణ బిల్లులో ఎక్కడా మీటర్లు పెట్టాలనే ప్రస్తావనే లేదని, సబ్సిడీల రద్దు కూడా లేదని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు అన్నారు. బిల్లుకు వ్యతిరేకంగా ఒకసారి తీర్మానం జరిగినందున లఘు చర్చ అవసరం లేదని చెప్పారు. బీజేపీ పుట్టిందే పేద, బడుగు వర్గాల కోసమని, పేద వర్గాలకు ఎప్పుడూ కీడు చేయదని అన్నారు. టీఆర్‌ఎస్‌ సభ్యులంతా నినాదాలు చేస్తూ రఘునందన్‌రావు ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ప్రసంగాన్ని ముగించాలని స్పీకర్‌ సూచించగా... సీఎం ఆమోదించిన తర్వాత మీకు వచ్చిన ఇబ్బందేంటి? అని రఘునందన్‌ ప్రశ్నించారు. చిన్నగాలి వచ్చినా గంటల తరబడి కరెంట్‌ సరఫరాలో అంతరాయం ఏర్పడుతోందని మజ్లిస్‌ ఎమ్మెల్యే అహ్మద్‌ బలాల చెప్పారు. పాతబస్తీలో 11 కేవీ లైన్లు ఉన్నచోటల్లా కవర్డ్‌ కండక్టర్లు వేయాలన్నారు. రన్నింగ్‌ కామెంట్రీ లాగా కాకుండా సమస్యలు వివరిస్తే పరిష్కరిస్తామని సీఎం చెప్పారు. గుజరాత్‌లో తడీపార్‌ రాజ్యాంగం అమలవుతోందని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే బాల్కసుమన్‌ వ్యాఖ్యానించారు. (2010లో హైకోర్టు  ఆదేశాల మేరకు అమిత్‌షా రెండేళ్లు గుజరాత్‌ బయట ఉన్నారు. అప్పటి నుంచి అమిత్‌షాను ప్రత్యర్థి పార్టీలు తడీపార్‌ అని పిలవడం మొదలు పెట్టాయి). గోదావరి వరదలతో నిర్వాసితులైన వారికి పరిహారం అందించాలని, మేడిగడ్డ పంప్‌హౌస్‌ మునకపై చర్చించాలని భట్టి ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్‌ తోసిపుచ్చారు. 

Updated Date - 2022-09-13T10:09:17+05:30 IST