తెలంగాణలో గిరిజనుల పరిస్థితి ఏంటి?

ABN , First Publish Date - 2022-07-15T10:13:54+05:30 IST

తెలంగాణలో గిరిజనుల పరిస్థితి ఏంటి? వారి జనాభా ఎంత? ఏ ప్రాంతంలో ఎక్కువగా నివసిస్తుంటారు? గిరిజనులు ఏపీలో ఎక్కువా? లేక తెలంగాణాలోనా

తెలంగాణలో గిరిజనుల పరిస్థితి ఏంటి?

రాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యేలతో భేటీలో ద్రౌపది ముర్ము ఆరా

హైదరాబాద్‌, జూలై 14 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో గిరిజనుల పరిస్థితి ఏంటి? వారి జనాభా ఎంత? ఏ ప్రాంతంలో ఎక్కువగా నివసిస్తుంటారు? గిరిజనులు ఏపీలో ఎక్కువా? లేక తెలంగాణాలోనా? అంటూ రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యేల వద్ద ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము ప్రశ్నించారు. రాష్ట్రపతి ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారమే ఆమె తెలంగాణలో పర్యటించాల్సి ఉన్నా.. ఏపీలో పర్యటన ఆలస్యం కావడంతో రాలేకపోయారు. దీంతో బీజేఎల్పీ నేత రాజాసింగ్‌, ఎమ్మెల్యేలు ఎం.రఘునందన్‌రావు, ఈటల రాజేందర్‌ గురువారం గోవా వెళ్లి ద్రౌపది ముర్ముతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ, ఏపీల్లో గిరిజనుల స్థితిగతులపై వివరాలు తెలుసుకునేందుకు ఆమె ఆసక్తి చూసినట్లు పమ్మెల్యేలు చెప్పారు. దుబ్బాక, హుజురాబాద్‌ ఉప ఎన్నికల్లో తాను, ఈటల రాజేందర్‌ గెలిచిన తీరును ద్రౌపది ముర్ముకు వివరించినట్లు ఎమ్మెల్యే రఘునందన్‌రావు ‘ఆంధ్రజ్యోతి’కి వెల్లడించారు.తెలంగాణలో రాజకీయ పరిస్థితులను ద్రౌపది ముర్ముకు వివరించినట్లు ఎమ్మెల్యే రాజాసింగ్‌ తెలిపారు.

Read more