విశాఖపట్నం-సికింద్రాబాద్‌ మధ్య వీక్లీ ప్రత్యేక రైళ్లు

ABN , First Publish Date - 2022-09-28T14:14:47+05:30 IST

విశాఖపట్నం-సికింద్రాబాద్‌ మధ్య వీక్లీ ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్టు దక్షిణమధ్య రైల్వే అధికారులు తెలిపారు. అక్టోబర్‌ 5 నుంచి 26 వరకు విశాఖపట్నం

విశాఖపట్నం-సికింద్రాబాద్‌ మధ్య వీక్లీ ప్రత్యేక రైళ్లు

హైదరాబాద్‌: విశాఖపట్నం-సికింద్రాబాద్‌ మధ్య వీక్లీ ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్టు దక్షిణమధ్య రైల్వే అధికారులు తెలిపారు. అక్టోబర్‌ 5 నుంచి 26 వరకు విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్‌ వరకు (బుధవారం) ప్రత్యేక రైలు (08579), అక్టోబర్‌ 6 నుంచి 27 వరకు సికింద్రాబాద్‌ నుంచి విశాఖపట్నం వరకు (గురువారం) ప్రత్యేక రైలు (08580), అక్టోబర్‌ 4 నుంచి 25 వరకు విశాఖపట్నం నుంచి మహబూబ్‌నగర్‌ వరకు (మంగళవారం) ప్రత్యేక రైలు (08585), అక్టోబర్‌  5 నుంచి 26 వరకు మహబూబ్‌నగర్‌ నుంచి విశాఖ వరకు(బు ధవారం) ప్రత్యేక రైలు (08586)ను నడుపుతున్నట్టు అధికారులు తెలిపారు. 

Read more