సింగరేణి బొగ్గుగనుల ప్రైవేటీకరణను అడ్డుకుంటాం!

ABN , First Publish Date - 2022-12-12T04:18:25+05:30 IST

కేంద్రం సింగరేణి బొగ్గు గనులను ప్రైవేట్‌పరం చేస్తే చూస్తూ ఊరుకోబోమని సీపీఐ జాతీయకార్యవర్గ సభ్యులు చాడవెంకట్‌రెడ్డి ఆదివారం హెచ్చరించారు.

సింగరేణి బొగ్గుగనుల ప్రైవేటీకరణను అడ్డుకుంటాం!

చాడవెంకట్‌రెడ్డి

హైదరాబాద్‌, డిసెంబరు 11(ఆంధ్రజ్యోతి): కేంద్రం సింగరేణి బొగ్గు గనులను ప్రైవేట్‌పరం చేస్తే చూస్తూ ఊరుకోబోమని సీపీఐ జాతీయకార్యవర్గ సభ్యులు చాడవెంకట్‌రెడ్డి ఆదివారం హెచ్చరించారు. వాటిని ప్రైవేటీకరిచేందుకు కేంద్రం నోటిఫికేషన్‌ ఇచ్చినట్లు వస్తున్న వార్తలపై ఆయన తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. అన్ని ప్రభుత్వరంగ సంస్థలను కేంద్రప్రభుత్వం బడా పారిశ్రామికవేత్తలకు అప్పనంగా కట్టబెడుతోందని చెప్పారు. మోదీ, అమిత్‌షాల చూపు ఇప్పడు సింగరేణి బొగ్గుగనులపై పడిందని చాడ అన్నారు. సింగరేణి గనులను వేలం వేయడానికి కేంద్రం చేస్తున్న ప్రయత్నాలను సీపీఐ అడ్డుకుంటుందని ఆయన తెలిపారు. సింగరేణి గనులను ప్రైవేటీకరించబోమని రామగుండం పర్యటనలో మోదీ చెప్పగా, వాటిని ప్రైవేటీకరిస్తామని కేంద్ర మంత్రి పార్లమెంటులో ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రపంచంలోనే సింగరేణి బొగ్గు ఆత్యంత నాణ్యమైనదని ఆయన చెప్పారు. సింగరేణి బొగ్గు గనులను కాపాడేందుకు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి చోరవ తీసుకోవాలని చాడ వెంకట్‌రెడ్డి కోరారు.

Updated Date - 2022-12-12T04:18:33+05:30 IST

Read more