డబ్బులిస్తేనే బస్సులను వెళ్లనిస్తాం

ABN , First Publish Date - 2022-08-21T08:50:45+05:30 IST

కేసీఆర్‌ సభకు హాజరైతే డబ్బులు ఇస్తామని చెప్పి ఇవ్వలేదంటూ టీఆర్‌ఎస్‌ నాయకులను రెండు వందల మంది నిలదీశారు.

డబ్బులిస్తేనే బస్సులను వెళ్లనిస్తాం

కేసీఆర్‌ సభకు వెళ్లినందుకు డబ్బులు ఇవ్వకపోవడంతో అడ్డుకున్న ప్రజలు

చౌటుప్పల్‌ రూరల్‌, ఆగస్టు 20: కేసీఆర్‌ సభకు హాజరైతే డబ్బులు ఇస్తామని చెప్పి ఇవ్వలేదంటూ టీఆర్‌ఎస్‌ నాయకులను రెండు వందల మంది నిలదీశారు. తమను సభకు తీసుకువెళ్లిన బస్సులు కదలకుండా అడ్డుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో శనివారం రాత్రి ఈ ఘటన జరిగింది. సభకు వస్తే రూ.500 ఇస్తామని చెప్పి స్కూల్‌ బస్సుల్లో మండల ప్రజలను సభకు తీసుకువెళ్లారు. తిరగి వచ్చాక డబ్బులు ఇవ్వలేదు. దీంతో సభకు వెళ్లినవాళ్లంతా ఆ బస్సులను అక్కడి నుంచి వెళ్లనీయలేదు. చేసేది లేక టీఆర్‌ఎస్‌ మండల నాయకులు డబ్బులు సర్దుబాటు చేసి ప్రజలకు పంచారు. 

Read more