జమిలి ఎన్నికలనే కోరుకుంటున్నాం: లక్ష్మణ్‌

ABN , First Publish Date - 2022-03-23T09:10:08+05:30 IST

రాష్ట్రంలో జమిలి ఎన్నికలే జరగాలని కోరుకుంటున్నట్లు బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌వెల్లడించారు.

జమిలి ఎన్నికలనే కోరుకుంటున్నాం: లక్ష్మణ్‌

హైదరాబాద్‌, మార్చి 22(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో జమిలి ఎన్నికలే జరగాలని కోరుకుంటున్నట్లు బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌వెల్లడించారు. అసెంబ్లీ ఎన్నికలకు, లోక్‌సభ ఎన్నికలకు మధ్య వ్యవధి ఐదు నెలలు మాత్రమే ఉంటుందని, ఈ మాత్రానికి వేర్వేరుగా ఎన్నిలు నిర్వహించాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు. మంగళవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మాట్లాడుతూ.. ప్రతీ గింజా కొంటాం.. అంటూ అసెంబ్లీ వేదికగా రైతులకు భరోసా ఇచ్చిన సీఎం కేసీఆర్‌.. ఇప్పుడు దొంగ నాటకం ఆడుతున్నారని మండిపడ్డారు.

Read more