సిజేరియన్‌ ఆపరేషన్లపై యుద్ధం చేస్తున్నాం

ABN , First Publish Date - 2022-05-18T09:15:23+05:30 IST

సిజేరియన్‌ ఆపరేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం యుద్ధం చేస్తోందని, ఆస్పత్రుల్లో సాధారణ ప్రసవాలను ప్రొత్సహించేందుకు చర్యలు తీసుకుంటోందని ప్రజారోగ్య శాఖ డైరెక్టర్‌ డాక్టర్‌ గడల శ్రీనివా్‌సరావు అన్నారు.

సిజేరియన్‌ ఆపరేషన్లపై యుద్ధం చేస్తున్నాం

  • రాష్ట్రలో 20శాతానికి తగ్గించేందుకు చర్యలు
  • నాణ్యమైన వైద్యం కోసం11,300కోట్ల బడ్జెట్‌
  • ప్రజారోగ్య శాఖ డైరెక్టర్‌ డాక్టర్‌ గడల 


యాదాద్రి, మే 17 (ఆంధ్రజ్యోతి): సిజేరియన్‌ ఆపరేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం యుద్ధం చేస్తోందని, ఆస్పత్రుల్లో సాధారణ ప్రసవాలను ప్రొత్సహించేందుకు చర్యలు తీసుకుంటోందని ప్రజారోగ్య శాఖ డైరెక్టర్‌ డాక్టర్‌ గడల శ్రీనివా్‌సరావు అన్నారు. మంగళవారం యాదాద్రిభువనగిరి జిల్లా కలెక్టరేట్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ుూపట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో అన్ని వసతులు ఏర్పాటు చేస్తున్నాం. ప్రజలు ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లి డబ్బులు వృధా చేసుకుని అప్పులపాలు కావొద్దు. రాష్ట్రంలో సిజేరియన్‌ శస్త్రచికిత్సలు కేవలం 20శాతం ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ప్రసవాలు ప్రభుత్వాస్పత్రుల్లో 60శాతం, ప్రైవేటులో 40శాతం జరుగుతున్నాయి. వీటిలో సిజేరియన్‌ ఆపరేషన్లు ప్రభుత్వ ఆస్పతుల్లో 40శాతం, ప్రైవేటులో 90శాతం వరకు జరుగుతున్నాయి. ప్రైవేటు వైద్యులతో అవగాహన సదస్సులు ఏర్పాటుచేసి సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలని ఆదేశాలు జారీ చేశాం. సాధారణ ప్రసవాల ద్వారా తల్లి, బిడ్డ ఆరోగ్యకరంగా ఉంటారు. రెండో కాన్పుకు కూడా సాధారణ ప్రసవానికి అవకాశం ఉంటుంది. ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని అందించేందుకు ప్రభుత్వం రూ. 11,300 కోట్ల బడ్జెట్‌ను  కేటాయించింది. ఇక, రాష్ట్రంలో కొవిడ్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. నాలుగో వేవ్‌ ప్రభావం అంతగా లేదు. 12ఏళ్ల లోపు చిన్నారులకూ వ్యాక్సినేషన్‌ను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ప్రభుత్వం ప్రతి నియోజకవర్గంలో డయాలసిస్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. అన్ని ప్రాథమిక కేంద్రాల్లోనూ వైద్య సేవలను మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటోంది్‌్‌ అని శ్రీనివాసరావు తెలిపారు. మంగళవారం ఆయన యాదగిరిగుట్ట లక్ష్మీనృసింహుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-18T09:15:23+05:30 IST