అర్హులందరికీ డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు

ABN , First Publish Date - 2022-11-24T23:27:50+05:30 IST

వందశాతం సబ్సిడీతో పేదలకు ఇళ్లు అందజేస్తున్న ఘనత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానిదేనని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. గురువారం హైదరాబాద్‌ నుంచి సీఎస్‌ సోమేశ్‌కుమార్‌, హౌసింగ్‌ స్పెషల్‌ సెక్రటరీ సునీల్‌శర్మతో కలిసి జిల్లా కలెక్టర్లతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

అర్హులందరికీ  డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు
వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హనుమంతు, ఇతర అధికారులు

హనుమకొండ, నవంబరు 24: వందశాతం సబ్సిడీతో పేదలకు ఇళ్లు అందజేస్తున్న ఘనత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానిదేనని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. గురువారం హైదరాబాద్‌ నుంచి సీఎస్‌ సోమేశ్‌కుమార్‌, హౌసింగ్‌ స్పెషల్‌ సెక్రటరీ సునీల్‌శర్మతో కలిసి జిల్లా కలెక్టర్లతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అర్హులకు డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు అందేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. నిర్మాణ దశలో ఉన్న ఇళ్లను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. డబుల్‌ బెడ్‌ ఇళ్ల నిర్మాణ పనుల పురోగతి, లబ్ధిదారుల ఎంపిక తదితర అంశాలపై కలెక్టర్లను అడిగి తెలుసుకున్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్‌ సంధ్యారాణి, డీఆర్‌ఓ వాసుచంద్ర, డీఆర్‌డీవో శ్రీనివా్‌సకుమార్‌, డీపీవో జగదీశ్‌, హౌసింగ్‌ అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-24T23:27:50+05:30 IST

Read more