‘ఉపాధి’ జాతర

ABN , First Publish Date - 2022-11-16T00:35:35+05:30 IST

వలసలను నివారించేందుకు అమలు చేస్తున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా ఏటా ఏడాదిపాటు నిర్వహించే పనుల గుర్తింపు ప్రక్రియ వేగంగా సాగుతోంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి చేపట్టాల్సిన పనులను గుర్తించే కసరత్తు ఉమ్మడి వరంగల్‌ జిల్లా వ్యాప్తంగా అధికారులు శరవేగంగా చేస్తున్నారు. బడ్జెట్‌ ప్రణాళిక రూపకల్పనకు ఈ ప్రక్రియను చేపట్టారు.

‘ఉపాధి’ జాతర
జఫర్‌గడ్‌లో ఉపాధి పనుల గుర్తిపునకు నిర్వహిస్తున్న గ్రామ సభ

ఈజీఎస్‌ పనుల గుర్తింపు ప్రక్రియ ప్రారంభం

ఉమ్మడి జిల్లాలో ముమ్మరంగా గ్రామ సభలు

వచ్చే యేడు నుంచి ప్రారంభం కానున్న పనులు

573 రకాల పనులకు ప్రణాళికలు

వలసలను నివారించేందుకు అమలు చేస్తున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా ఏటా ఏడాదిపాటు నిర్వహించే పనుల గుర్తింపు ప్రక్రియ వేగంగా సాగుతోంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి చేపట్టాల్సిన పనులను గుర్తించే కసరత్తు ఉమ్మడి వరంగల్‌ జిల్లా వ్యాప్తంగా అధికారులు శరవేగంగా చేస్తున్నారు. బడ్జెట్‌ ప్రణాళిక రూపకల్పనకు ఈ ప్రక్రియను చేపట్టారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో గ్రామాల్లో చేసే పనుల గుర్తింపు, కూలీల బడ్జెట్‌ తయారు చేయాలని ప్రభుత్వం సెప్టెంబర్‌ చివరి వారంలోనే ఉత్తర్వులను జారీ చేసిన నేపథ్యంలో పనుల గుర్తింపునకు అన్ని గ్రామాల్లో గ్రామసభలు జోరుగా సాగుతున్నాయి.

హనుమకొండ, నవంబర్‌ 15 (ఆంధ్రజ్యోతి) : వరంగల్‌, హనుమకొండ, జనగామ, మహబూబాబాద్‌, ములుగు, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాల్లో ఉపాధి హామీ పనులపై అధికారులు గ్రామాల వారీగా ప్రణాళిక తయారు చేస్తు న్నారు.పల్లెల్లో ప్రాధాన్యం కలిగిన పనులను గుర్తించి గ్రామ సభల ద్వారా ప్రజల ఆమోదం పొందనున్నారు. గ్రామ, మండల, జిల్లా, రాష్ట్రస్థాయిలో గుర్తించిన పనులకు బడ్జెట్‌ రూపొందించి కేంద్రానికి పంపించనున్నారు. అనంతరం కేంద్రం నుంచి ఆదేశాలు రాగానే వచ్చే ఏప్రిల్‌ నుంచి ఏడాది పాటు గ్రామాల్లో పనులు నిర్వహించనున్నారు.

ప్రక్రియ

అక్టోబరు 2 నుంచి గ్రామ సభల నిర్వహణ ప్రారంభమైం ది. నవంబర్‌ 30 వరకు గ్రామ సభలు కొనసాగుతాయి. ఈ నెల మొదటివారంలో మొదటి దశ గ్రామ సభలు పూర్త య్యాయి. మూడో వారంలో రెండో దశ గ్రామసభలను నిర్వ హిస్తారు. అనంతరం ప్రత్యేక గ్రామ సభను ఏర్పాటు చేస్తా రు. ఇందులో అసంపూర్తి పనులు, జాబ్‌ కార్డుల ఆప్‌డేషన్‌, పౌరసమాచార తయారీ, సామాజిక తనిఖీలపై చర్చిస్తారు. పనుల వివరాలను మండల పరిషత్తు, అక్కడి నుంచి జిల్లా పరిషత్తు ఆమోదం కోసం పంపిస్తారు. జిల్లా స్థాయిలో రూ పొందించిన ప్రణాళికను వచ్చే సంవత్సరం జనవరి 2వ తేదీన ఆమోదిస్తారు. తరువాత జిల్లా కలెక్టర్‌ ఆమోదంతో రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించాల్సి ఉంటుంది. రాష్ట్ర స్థాయిలో ఆమోదం జనవరి 31న జరుగుతుంది. ఆమోదం పొందిన ఉపాధి హామీ పనుల అమలుకు కూలీలకు చెల్లించాల్సిన బడ్జెట్‌ వచ్చే సంవత్సరం మార్చి 31న విడుదల అవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తరువాత ఈ ఉపాధి పనులను ఏప్రిల్‌ 1 నుంచి ప్రారంభమయ్యేలా కార్యాచరణ రూపొందిస్తారు.

17 విభాగాల్లో పనులు

2023-24 ఆర్థిక సంవత్సరానికిగాను 17 విభాగాల్లో 573 రకాల పనులు చేపట్టడానికి అవకాశాలున్నట్టు అధికారులు ఇప్పటికే గుర్తించారు. ముఖ్యంగా భూగర్భ జలాల పెంపున కు ప్రాధాన్యం ఇచ్చేలా ప్రణాళికల తయారీకి ప్రాధాన్యం ఇ వ్వాలని రైతులు కోరుతున్నారు. దీనితో పాటు ఉపాధి పను ల గుర్తింపులో గ్రామ పంచాయతీ, అంగన్వాడీ కేంద్రాల భవన నిర్మాణాలు, భూగర్భ జలాలు, పెంచేందుకు ఇంకుడు గుంతల నిర్మాణం, వ్యవసాయ, చిన్ననీటి కుంటల ఏర్పాటు, చెక్‌డ్యాంల నిర్మాణం, వర్షపు నీటిని నిల్వ చేసే కట్టడాలతో పాటు నీటి పారుదల కాలువల పూడికతీత పనులకు ప్రా ధాన్యం ఇవ్వనున్నారు. నర్సరీల ఏర్పాటు కంపోస్టు షెడ్ల నిర్మాణాలతో పనులు చేపట్టనున్నారు.

వృథా కాకుండా..

క్షేత్రస్థాయిలో పనులు సక్రమంగా అమలు కాకపోవడం తో నిధులు వృథా అవుతున్నాయనే విమర్శలు ఉన్నాయి. అంతేకాకుండా పనులు ప్రారంభించి అసంపూర్తిగా ఉండ డంతో నూతన పనులు చేపట్టేందుకు ఇబ్బందిగా మారింది. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకునే ఈ ఏడాది ఇప్పటికే నూతన సాంకేతిక అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా గ్రామాల్లో 20 పనులను ప్రతిపాదించి అవి పూర్తి చేసిన తరువాతే మిగిలిన పనులు చేపట్టేలా చర్యలు తీసుకుంటు న్నారు. దీనివల్ల గ్రామాల్లో పనులు సత్వరమే పూర్తి కావడ మే కాకుండా నూతనపనులు చేపట్టే ప్రక్రియ వేగంగా కొన సాగుతున్నాయి.

16.69 లక్షల మంది కూలీలు

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో మొత్తం 7.95 లక్షల జాబ్‌ కార్డులు ఉన్నాయి. వీటి కింద మొత్తం 16.69లక్షల కూలీలు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. హనుమకొండ జిల్లాలో మొత్తం 96వేల జాబ్‌ కార్డులు ఉన్నాయి. వీటి కింద మొత్తం 2.08 లక్షల మంది కూలీలు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. అయితే జిల్లాలో ప్రస్తుతం 66వేల మంది జాబ్‌ కార్డులు మాత్రమే వినియోగంలో ఉన్నాయి. వీటి ద్వారా 1.17 లక్షల మంది కూలీలు ఉపాధి పనులు చేస్తున్నారు. జనగామ జిల్లాలో మొత్తం 1.31 లక్షల జాబ్‌ కార్డులు ఉన్నాయి. వీటి కింద 2.88మంది కూలీలు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. 1.61 మంది కూలీలు మాత్రమే రెగ్యులర్‌గా ఉపాఽధి పనులు చేస్తున్నారు. భూపాలపల్లి జిల్లాలో మొత్తం 1.16 లక్షల జాబ్‌ కార్డులు ఉన్నాయి. వీటి కింద 2.15లక్షల మంది కూలీలు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. 1.40లక్షల మంది రెగ్యులర్‌గా ఉపాధి పనులకు వెళుతున్నారు. మహబూబాబాద్‌ జిల్లాలో మొత్తం 2.32లక్షల జాబ్‌ కార్డులు ఉండగా, వీటి కింద 5.23 లక్షల మంది కూలీలు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. 2లక్షల కార్డులు వినియోగంలో ఉన్నాయి. వీటి ద్వారా సుమారు 5 లక్షల మంది ఉపాధి పనులు రెగ్యులర్‌గా చేస్తున్నారు. ములుగు జిల్లాలో మొత్తం 1.15 లక్షల జాబ్‌ కార్డులు ఉనన్నాయి. వీటి ద్వారా 2.10 లక్షల మంది కూలీలు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. వరంగల్‌ జిల్లాలో 1.05 లక్షల జాబ్‌ కార్డులు ఉన్నాయి. వీటి కింద 2.15 లక్షల మంది తమ పేర్లను నమోదు చేసుకున్నారు.

Updated Date - 2022-11-16T00:35:39+05:30 IST