చేపల వేటకు వెళ్లి ముగ్గురి గల్లంతు

ABN , First Publish Date - 2022-11-25T00:25:54+05:30 IST

చేపల వేటకు వెళ్లి ముగ్గురు గల్లం తయ్యారు. వీరులో ఇద్దరు సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. ఒకరి ఆచూకీ మాత్రం లభించలేదు. ఈ సంఘటన జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహ దేవపూర్‌ మండలంలోని మేడిగడ్డ బ్యారేజీ వద్ద మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా అంకీస పోలీస్‌స్టేషన్‌ పరిధిలో గురువారం చోటుచేసుకుంది.

చేపల వేటకు వెళ్లి ముగ్గురి గల్లంతు
గల్లంతైన సమ్మయ్య కోసం నాటు పడవలతో గాలింపు చేపడుతున్న గ్రామస్థులు

సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్న ఇద్దరు

ఒకరి కోసంగాలింపు చర్యలు

ముగ్గురూ మహారాష్ట్రకు చెందిన వారే..

మహదేవపూర్‌ రూరల్‌, నవంబరు 24: చేపల వేటకు వెళ్లి ముగ్గురు గల్లం తయ్యారు. వీరులో ఇద్దరు సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. ఒకరి ఆచూకీ మాత్రం లభించలేదు. ఈ సంఘటన జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహ దేవపూర్‌ మండలంలోని మేడిగడ్డ బ్యారేజీ వద్ద మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా అంకీస పోలీస్‌స్టేషన్‌ పరిధిలో గురువారం చోటుచేసుకుంది. ప్రత్యక్ష సాక్షులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..

మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా సిరొంచా తాలూకా కమ్మలపేటకు చెందిన గగ్గూరి సమ్మయ్య, చౌల సమ్మయ్య, తోట సమ్మయ్య మేడిగడ్డ దిగవ ప్రవాహం లో చేపలు వేటకు వెళ్లారు. బ్యారేజీలోని 50వ గేటు వద్ద చేపలు పడుతుండగా ప్రవాహంతో ఒక్కసారిగా పడవ మునిగిపోయింది. దీంతో ముగ్గురూ గల్లంత య్యారు. సుమారు అర్ధగంట తర్వాత గగ్గూరి సమ్మయ్య, చౌల సమ్మయ్య ఈదు కుంటూ ఒడ్డుకు చేరుకోగా తోట సమ్మయ్య(22) ఆచూకీ లభించలేదు. ప్రమాద సమాచారం అందుకున్న మహారాష్ట్ర, మహాదేవపూర్‌ పోలీసులు బ్యారేజీ గేట్లను మూసివేసి గాలింపు చర్యలు చేపట్టారు. సాయంత్రం వరకు వెతికినా తోట సమ్మయ్య ఆచూకీ లభించలేదు. ప్రమాదం జరిగిన ప్రదేశం మహారాష్ట్ర పరిధి లోకి రావడంతో తెలంగాణ పోలీసులు ఎలాంటి కేసు నమోదు చేయలేదని తెలి పారు. గల్లంతైన సమ్మయ్యకు శుక్రవారం వివాహ నిశ్చితార్థం ఉందని తెలిసింది.

Updated Date - 2022-11-25T00:25:54+05:30 IST

Read more