కీచక టీచర్‌

ABN , First Publish Date - 2022-11-30T00:52:34+05:30 IST

విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడు కీచకుడిగా మారాడు. ఓ విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు.

కీచక టీచర్‌

పోక్సో కేసు నమోదు

ములుగు, నవంబరు 29: విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడు కీచకుడిగా మారాడు. ఓ విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ములుగు జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో పదో తరగతి చదువుతున్న బాలిక (15) పట్ల అదే పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న తిప్పాని కృష్ణ అసభ్యంగా ప్రవర్తించాడు. ఆధార్‌కార్డు వెరిఫికేషన్‌ కోసమంటూ పలువురు విద్యార్థినులను గదిలోకి పిలిచిన ఉపాధ్యాయుడు అందరూ వెళ్లిపోయాక ఆ బాలికను మాత్రమే కాసేపు ఉండమని చెప్పి లైంగికంగా వేధించాడు. ఈ విషయాన్ని ఆమె తన తల్లిదండ్రులకు చెప్పగా వారు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కృష్ణపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిట్టు ములుగు ఎస్సై బి.ఓంకార్‌ యాదవ్‌ తెలిపారు.

Updated Date - 2022-11-30T00:52:34+05:30 IST

Read more