మెరిసిన ఓరుగల్లు

ABN , First Publish Date - 2022-11-24T23:36:16+05:30 IST

వరంగల్‌ నగరం మరో ఘనతను సొంతం చేసుకుంది. స్వచ్ఛ సర్వేక్షణ్‌-2022 ఫాస్ట్‌ మూవింగ్‌ సిటీస్‌ (10 లక్షల జనాభా కేటగరీ నగరాలు)లో నగరం మూడో ర్యాంక్‌ను పొందింది. స్వచ్ఛ సర్వేక్షణ్‌-2021 పోటీల్లో నగరం 115వ ర్యాంక్‌లో నిలువగా, 2022 పోటీల్లో 62వ ర్యాంక్‌ను సాధించింది మెరుగైన స్థానాన్ని పొందింది. ఏడాది వ్యవధిలోనే నగరం 62వ ర్యాంక్‌ సాధించుకోవడాన్ని ప్రొత్సహిస్తూ ఫాస్ట్‌ మూవింగ్‌ సిటీలో వరంగల్‌ నగరం ఒకటిగా పేరొందింది.

మెరిసిన ఓరుగల్లు

ప్రకటించిన ఎంవోహెచ్‌యూఏ

జీడబ్ల్యూఎంసీ(హనుమకొండ సిటీ), నవంబరు 24: వరంగల్‌ నగరం మరో ఘనతను సొంతం చేసుకుంది. స్వచ్ఛ సర్వేక్షణ్‌-2022 ఫాస్ట్‌ మూవింగ్‌ సిటీస్‌ (10 లక్షల జనాభా కేటగరీ నగరాలు)లో నగరం మూడో ర్యాంక్‌ను పొందింది. స్వచ్ఛ సర్వేక్షణ్‌-2021 పోటీల్లో నగరం 115వ ర్యాంక్‌లో నిలువగా, 2022 పోటీల్లో 62వ ర్యాంక్‌ను సాధించింది మెరుగైన స్థానాన్ని పొందింది. ఏడాది వ్యవధిలోనే నగరం 62వ ర్యాంక్‌ సాధించుకోవడాన్ని ప్రొత్సహిస్తూ ఫాస్ట్‌ మూవింగ్‌ సిటీలో వరంగల్‌ నగరం ఒకటిగా పేరొందింది. ఈ క్రమంలో కేంద్ర మినిస్ట్రీ ఆఫ్‌ హౌసింగ్‌ అండ్‌ అర్బన్‌ ఎఫైర్స్‌ గురువారం ప్రకటించిన నగరాల్లో వరంగల్‌ 3వ ర్యాంక్‌ను సాధించింది. తొలి రెండు స్థానాల్లో ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్‌ నిలిచింది.

మెరుగైన ర్యాంకులతో ఘనత

స్వచ్ఛ సర్వేక్షణ్‌తో పాటు నర్చరింగ్‌ నైబర్‌హుడ్‌ చాలెంజ్‌ పోటీల్లో వరంగల్‌ నగరం మెరుగైన ర్యాంకులు సాధిస్తూ జాతీయస్థాయిలో గుర్తింపును సాధిస్తోంది. స్వచ్ఛ సర్వేక్షణ్‌ పోటీల్లో ఏడాది వ్యవధిలోనే 115 నుంచి 62వ ర్యాంక్‌ను సాధించడంతో వరంగల్‌ నగరం క్రమంలో టాప్‌టెన్‌ టార్గెట్‌లో స్థానం కోసం పోటీ పడుతోంది. మెరుగైన పారిశుధ్య విధానాల అవలంబన, అత్యాధునిక సాంకేతిక వాహనాల వినియోగం, ఇంటింటి చెత్త సేకరణ వంటి అంశాలు నగరానికి మెరుగైన ర్యాంక్‌ను సాధించడానికి కారణమయ్యాయి. ఇక వరంగల్‌ అమ్మవారిపేటలోని మానవ వ్యర్థాల శుద్ధీకరణ ప్లాంట్‌, నగరంలో సీవేజ్‌ ట్రిట్‌మెంట్‌ ప్లాంట్ల నిర్మాణం, మరుగుదొడ్ల నిర్వహణ, నగర సుందరీకరణ, మార్కెట్లు, మురికికాలువల పరిశుభ్రత, వాటర్‌బాడీల పరిశుభ్రత తదితర అంశాలు మెరుగైన ర్యాంక్‌ సాధించడానికి ఉపయుక్తమయ్యాయి. అమ్మవారిపేటలోనే మరో ఎఫ్‌ఎ్‌సటీ ప్లాంట్‌ నిర్మాణమవుతుంది. 150 కేఎల్‌డీ సామర్థ్యంలో ఈ ప్లాంట్‌ను బల్దియా నిర్మిస్తోంది. ప్లాంట్‌ పూర్తయితే నగరం స్వచ్ఛ సర్వేక్షణ్‌ పోటీల్లో మరింత మెరుగైన స్థానంలో నిలుస్తుంది. క్రమక్రమంగా నగరం ఉన్నత స్థానాలను సాధిస్తూ జాతీయ స్థాయిలోనే కాక ఇతర దేశాలకు కూడా రోల్‌ మోడల్‌గా నిలిచే దిశగా అడుగులు వేస్తోంది.

సంతోషంగా ఉంది : మేయర్‌ సుధారాణి

నగరానికి ఇటీవల వరుసగా ర్యాంకులు రావడం సంతోషంగా ఉంది. స్వచ్ఛ సర్వేక్షణ్‌-2022 పోటీల్లో నగరం 62వ స్థానంలో నిలువడం, ఫాస్ట్‌ మూవింగ్‌ సిటీ్‌సలో 3వ ర్యాంక్‌ను సాధించడం, ఓడీఎఫ్‌ ప్లస్‌ ప్లస్‌గా మూడుసార్లు నగరం నిలువడం అభినందనీయం. జీడబ్ల్యూఎంసీ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, నగర ప్రజల సహకారంతో ఘనత దక్కింది. పారిశుధ్య నిర్వహణలో వరంగల్‌ నగరం అత్యున్నత స్థాయికి దూసుకెళుతోంది. ఎఫ్‌ఎ్‌సటీ, సీవేజ్‌ ప్లాంట్లు, బయో మైనింగ్‌ నిర్వహణ వంటివి బల్దియా కృషికి నిదర్శనం.

Updated Date - 2022-11-24T23:36:16+05:30 IST

Read more