గంజాయి మత్తులో విద్యార్థులు

ABN , First Publish Date - 2022-11-27T23:43:31+05:30 IST

ఉన్నత చదువులు చదివి జీవితంలో పైకి రావాల్సిన నలుగురు ఇంజనీరింగ్‌ విద్యార్థులతోపాటు మరో ఇద్దరు డిగ్రీ, ఐటీఐ విద్యార్థులు, ఓ కారు డ్రైవర్‌ గంజాయి తాగుతూ పోలీసులకు పట్టుబడ్డారు. కమలాపూర్‌ పోలీసు స్టేషన్‌లో ఆదివారం విలేకరుల సమావేశంలో పోలీసు ఇన్స్‌పెక్టర్‌ బొలిమల్ల సంజీవ్‌ అరెస్టు చూపించి వివరాలను వెల్లడించారు.

గంజాయి మత్తులో విద్యార్థులు
నిందుతులను అరెస్టు చూపుతున్న పోలీసులు

పరారీలో మరో ఇద్దరు

కమలాపూర్‌, నవంబరు 27: ఉన్నత చదువులు చదివి జీవితంలో పైకి రావాల్సిన నలుగురు ఇంజనీరింగ్‌ విద్యార్థులతోపాటు మరో ఇద్దరు డిగ్రీ, ఐటీఐ విద్యార్థులు, ఓ కారు డ్రైవర్‌ గంజాయి తాగుతూ పోలీసులకు పట్టుబడ్డారు. కమలాపూర్‌ పోలీసు స్టేషన్‌లో ఆదివారం విలేకరుల సమావేశంలో పోలీసు ఇన్స్‌పెక్టర్‌ బొలిమల్ల సంజీవ్‌ అరెస్టు చూపించి వివరాలను వెల్లడించారు.

కమలాపూర్‌ మండలంలోని మాధన్నపేట గ్రామ శివారులోని తాటివనంలో గంజాయిని తాగుతున్నారనే సమాచారం మేరకు వెళ్ళి దాడులు జరిపామని తెలిపారు. ఇందులో హనుమకొండలోని ఓ రెండు ప్రైవేటు ఇంజనీరింగ్‌ కళాశాలలలో చదువుతున్న పరకాలకు చెందిన పిట్ల కళ్యాణ్‌, మంద అరవింద్‌ (బీటెక్‌ ఫస్ట్‌ ఇయర్‌), రేగొండకు చెందిన రూపిరెడ్డి వంశీ(బీటెక్‌ థర్డ్‌ ఇయర్‌), గోపు వినయ్‌రెడ్డి(బీటెక్‌ సెకండ్‌ ఇయ్యర్‌), పరకాలకు చెందిన పాలకుర్తి విజయ్‌ బీకాం (ఫైనల్‌ ఇయర్‌), కమలాపూర్‌ గ్రామానికి చెందిన వెంగళ విజయ్‌ ఐటీఐ(సెకండ్‌ ఇయ్యర్‌), భీమారానికి చెందిన ఎస్‌కే ఖాజా అనే కారు డ్రైవర్‌లు గంజాయి తాగుతుండగా పట్టుకున్నామన్నారు. వారు గుర్తు తెలియని వ్యక్తుల దగ్గర గంజాయిని కొనుగోలు చేసి తాగుతున్నారన్నారు. వారి నుంచి ఐదు సెల్‌ఫోన్లు, రెండు హుక్కా పార్ట్స్‌ను, సిగరెట్‌ ప్యాకెట్లు, ఖాళీ కూల్‌ డ్రింక్స్‌ బాటిల్స్‌తో పాటు రూ.5వేల విలువ గల 510 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని ఆయన తెలిపారు. దీంతో తొమ్మిదిమందిపై కేసు నమోదు చేసి, ఏడుగురిని అరెస్టు చేశామన్నారు. గంజాయిని విక్రయించిన ఇద్దరు వ్యక్తులు పరారీలో ఉన్నారన్నారు. సమావేశంలో ఎస్‌ఐలు చరణ్‌, సతీష్‌, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-27T23:43:32+05:30 IST