అడవి కోసం తపించిన శ్రీనివాసరావు

ABN , First Publish Date - 2022-11-24T00:13:43+05:30 IST

గొత్తికోయల చేతిలో దారుణ హత్యకు గురైన చెలుమల శ్రీనివాసరావు గతంలో ములుగు జిల్లాలో పనిచేశారు. తాడ్వాయి మండలం లింగాల రేంజ్‌ అధికారిగా 2017 నుంచి 2019 వరకు కొనసాగారు. విధినిర్వహణలో సక్సెస్‌ఫుల్‌ ఆఫీసర్‌గా పేరు తెచ్చుకున్నారు.

అడవి కోసం తపించిన శ్రీనివాసరావు
ములుగులో 2019లో స్వాతంత్య్ర వేడుకల్లో అప్పటి కలెక్టర్‌ నారాయణరెడ్డి, ఎమ్మెల్యే సీతక్క చేతుల మీదుగా ఉత్తమ ఉద్యోగి అవార్డు అందుకుంటున్న ఎఫ్‌ఆర్వో శ్రీనివాసరావు (ఫైల్‌)

ములుగు, నవంబరు 23: గొత్తికోయల చేతిలో దారుణ హత్యకు గురైన చెలుమల శ్రీనివాసరావు గతంలో ములుగు జిల్లాలో పనిచేశారు. తాడ్వాయి మండలం లింగాల రేంజ్‌ అధికారిగా 2017 నుంచి 2019 వరకు కొనసాగారు. విధినిర్వహణలో సక్సెస్‌ఫుల్‌ ఆఫీసర్‌గా పేరు తెచ్చుకున్నారు. అవీ సంరక్షణలో ఆయన అవలంబించిన విధానాలతో ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకున్నారు. గోవిందరావుపేట మండ లం పస్రాలో కార్యాలయం ఉండగా నిత్యం అడవుల లోనే ఆయన ప్రయాణం సాగేదని తోటి ఉద్యోగులు చెప్పారు. లింగాల రేంజ్‌ పరిధిలో లింగాల, బోటిలిం గాల, కొడిశాల, అల్లిగూడెం, బందాల, నర్సాపూర్‌, బొల్లె పల్లి, ఒడ్డుగూడెం గ్రామాలుంటాయి. ఈ ఊళ్లచుట్టూ దట్టమైన అభయారణ్యం విస్తరించి ఉండగా అడవు లు, వన్యప్రాణుల సంరక్షణ ఫారెస్టు అధికారులకు ఎప్పుడూ సవాల్‌గా ఉండేది. ఈక్రమంలో శ్రీనివాసరా వు వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ఆదివాసీలు, గొత్తికోయలతో మమేకమైన ఆయన అటవీ సంరక్షణ పై అవగాహన కల్పించారు. కొడిశాల వద్ద నర్సరీ ఏర్పాటు చేశారు. ఒడ్డుగూడానికి ఐదు కిలోమీ టర్లదూరంలో నట్టడివిలో గుట్టుగా సాగుతున్న అక్ర మ పోడును గుర్తించారు. సుమారు 5 వేల ఎకరాల విస్తీర్ణంలో చెట్లను నరికివేసేందుకు జరుగుతున్న ప్రయత్నాలను అడ్డుకున్నారు. అప్పటి తాడ్వాయి ఎస్సై జి.రవీందర్‌ యాదవ్‌ సహకారంతో భారీ పోడు యత్నాన్ని భగ్నం చేసి ఐదు ట్రాక్టర్లను సీజ్‌ చేశారు. ఆదివాసీలు, గొత్తికోయలను మభ్యపెట్టి పోడుకు ప్రోత్సహిస్తున్న వ్యక్తులను జైలుకు కూడా పంపిం చడంతో చెట్ల నరికివేతకు అడ్డుకట్టపడింది. దీంతో శ్రీనివాసరావును ప్రశంసించిన ఉన్నతా ధికారులు రాష్ట్ర స్థాయి ఉత్తమ అధికా రిగా పురస్కారం ఇచ్చారు. ఈ క్రమంలో శ్రీనివాసరావుపై ఓసారి మావోయిస్టులు దాడి చేశారని, తృటిలో ఆయన తప్పిం చుకున్నారని తెలిసింది. లవ్వాల, బందా ల అటవీప్రాంతం నుంచి నర్సంపేట వైప కలప, ఇసుక యథేచ్ఛగా రవాణా అయ్యేది. దీంతో బోటిలింగాల వద్ద చెక్‌పోస్టు ఏర్పాటుచేసి ఈ అక్రమ రవాణాను నియంత్రిం చారు. విధి నిర్వహణలో ముక్కు సూటిగా వ్యవహరించే శ్రీనివాసరావు హత్యకు గురైన సంఘటన జిల్లాలోని అటవీ శాఖ అధికారులు, సిబ్బందిని తీవ్రంగా కలిచివేసింది.

నివాళులర్పించిన అటవీ ఉద్యోగులు

హత్యకు గురైన ఫారెస్టు రేంజ్‌ అధికారి శ్రీని వాసరావుకు ములుగు జిల్లా అటవీ ఉద్యోగులు నివా ళులర్పించారు. బుధవారం జిల్లా ఫారెస్టు కార్యా లయంలో ఆయన చిత్రపటం వద్ద శ్రద్ధాంజలి ఘటిం చారు. అనంతరం ప్రధాన వీధులు, జాతీయ రహదా రిపై సంతాప ర్యాలీ నిర్వహించారు.

Updated Date - 2022-11-24T00:13:45+05:30 IST