రామప్ప అభివృద్ధిపై దృష్టి పెట్టాలి

ABN , First Publish Date - 2022-11-30T23:36:18+05:30 IST

రామప్ప దేవాలయం, ఉప ఆలయాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిసారించాలని రాష్ట్ర ఫైనాన్స్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ శ్రీదేవి అధికారులను ఆదేశించారు.

రామప్ప అభివృద్ధిపై దృష్టి పెట్టాలి
రామప్ప దేవాలయ అభివృద్ధిపై కలెక్టర్‌తో చర్చిస్తున్న ఫైనాన్స్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ

వెంకటాపూర్‌ (రామప్ప) నవంబరు 30: రామప్ప దేవాలయం, ఉప ఆలయాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిసారించాలని రాష్ట్ర ఫైనాన్స్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ శ్రీదేవి అధికారులను ఆదేశించారు. ప్రపంచ వారస త్వ కట్టడమైన ములుగు జిల్లా వెం కటాపూర్‌ మండలంలోని రామప్ప ఆలయాన్ని కలెక్టర్‌ కృష్ణ ఆదిత్యతో కలిసి ఆమె బుధవారం సందర్శించారు. అర్చకులు ఉమాశంక ర్‌, హరీశ్‌ శర్మ పూర్ణకుంభ స్వాగతం పలికారు. రామలింగేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేసిన శ్రీదేవి అనంతరం ఆలయానికి పశ్చిమ భాగంలో ఉన్న కాలభైరవ ఆలయాన్ని సందర్శించారు. దాని పునరుద్ధరణ డీపీఆర్‌ను పంపాలని పురావస్తు శాఖ అధికారులను, కలెక్టర్‌ను ఆదేశించారు. ఆల య సందర్శనకు వచ్చిన విద్యార్థులతో ఆమె ఈ సందర్భంగా కొద్దిసేపు ముచ్చటించారు. ఆలయ శిల్పకళా సంపదను చూసి మంత్రముగ్ధులయ్యారు. రామప్ప సరస్సులో అధికారులతో కలిసి బోటింగ్‌ చేశారు. ఆమె వెంట రాష్ట్ర పురవాస్తు శాఖ ఏడీలు నర్సింగ్‌ , మల్లు నాయక్‌, వరంగల్‌ ఉమ్మడి జిల్లా పర్యాటక అధికారి శివాజీ, ములుగు జిల్లా పర్యాటక శాఖ అధికారి సూర్య కిరణ్‌, తహసీల్దార్‌ మంజుల, పర్యాటక శాఖ మేనేజర్‌ అశోక్‌, ఏఎస్సై కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-30T23:36:18+05:30 IST

Read more