అన్నపూర్ణకు సంకెళ్లు!

ABN , First Publish Date - 2022-12-13T23:50:22+05:30 IST

నిరుపయోగంగా ఉంటున్న పంట పొలాలు ఆహారభద్రతకు పొంచివున్న ముప్పు ఆదాయం మాయలో పడి కళ్లు మూసుకున్న సర్కారు వ్యాపారుల ఆధీనంలో వందల ఎకరాలు భవిష్యత్‌లో పేదవాడికి గూడు కూడా కష్టమే పరిమితి విధించాలంటున్న విశ్లేషకులు

అన్నపూర్ణకు సంకెళ్లు!

బచ్చన్నపేట, డిసెంబరు 13: జిల్లాలో వ్యవసాయ భూములు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారుల చేతుల్లో బందీ అవుతున్నాయి. దీంతో భవిష్యత్తులో ఆహారభద్రతకు ముప్పు ఏర్పడే ప్రమాదం నెలకొంది. ఒకప్పుడు హైద రాబాద్‌ శివార్లు, జిల్లా కేంద్రాల చుట్టూ రియల్‌ ఎస్టే ట్‌ వ్యాపారం కొనసాగేది. ప్రస్తుతం మండలాల్లోని మారుమూల గ్రామాలకు సైతం విస్తరిస్తోంది. వ్యాపా రులు ఎకరాల చొప్పున కొని గజాల చొప్పున అమ్మి అనతికాలంలోనే కోట్లు గడిస్తున్నారు. మరి కొంత మంది వందల ఎకరాలు కొనుగోలు చేసి ఫెన్సింగ్‌ చేసి వదిలిపెడుతున్నారు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు అధిక ధరలు వెచ్చించి భూములు కొనుగోలు చేస్తుండటంతో రైతులు కూడా అమ్మడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇందుకు వారి ఆర్థిక పరిస్థితు లు, అవసరాలు, వ్యవసాయంలో నష్టాలు తదితర కారణాలై ఉండవచ్చు. కానీ ఇప్పుడు నాలుగు ఎకరాలు అమ్మినవారు, భవిష్యత్తులో ఒక్క ఎకరం కూడా కొనుగోలు చేయలేమని గుర్తించలేకపో తున్నారు. కాగా రియల్‌ వ్యాపారులు కొనుగోలు చేసిన భూముల్లో పంటలు వేయటానికి ఆసక్తి చూపకపోవటంతో ఒక్కో మండలంలో వందలాది ఎకరాల సాగుకు అనుకూ లమైన భూములు బీడువారుతున్నాయి.

వ్యాపారుల చేతుల్లో చిక్కి..

జిల్లాలో మొత్తం 5,28,278 ఎకరాల భూమి ఉండగా, అందులో 3,70,040 ఎకరాలు సాగుకు యోగ్యమైన భూమి ఉంది. ఇందులో 20 శాతం భూములు రియల్‌ వ్యాపారుల చేతుల్లో ఉన్నాయి. ఇందు లో 5 శాతం భూముల్లో పండ్ల తోటలు పెంచుతుం డగా 15 శాతం బీడు భూము లుగా మారుతున్నాయి. ఈ దందా ఇలాగే కొనసాగితే మరో ఐదేళ్లలో సగానికి పైగా సాగుభూములు బీడువారే ప్రమాదం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.

తగ్గనున్న వ్యవసాయ ఉత్పత్తులు..

సాగు భూములన్నీ బీడువారితే వ్యవసాయ ఉత్ప త్తులు గణనీయంగా తగ్గిపోయి, ఆహార భద్రతకు ముప్పు ఏర్పడే పరిస్థితు లున్నాయనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అంతేగాకుండా వ్యవ సాయంపై ఆధారప డి జీవించే రైతులు, కూలీలు ఉపాధికి దూరం కానున్నా రు. వ్యవసాయానికి ప్రాధాన్యత కలిగిన తెలంగాణాలో రియల్‌ రంగం మూలంగా వ్యవసాయ రంగం కుదేల య్యే పరిస్థితులున్నాయి. అదే జరిగితే నేటి రైతులందరూ రేపు దినసరి కూలీలుగా మారిపో యే దుస్థితి లేకపోలేదు. ముఖ్యంగా జనగామ జిల్లాలో గత ఐదేళ్ల కాలంలో రియల్‌ వ్యాపారం అధికంగా సాగుతుండటంతో వ్యవసాయ భూములు వ్యవసా యేతర భూములుగా మారిపోతున్నాయి.

రియల్‌ వ్యాపారం మూలంగా ప్రభుత్వానికి గణనీయంగా ఆదా యం సమకూరుతుందని భావించినా, భవిష్యత్తులో విపత్కర పరిస్థితులు ఎదురవుతాయని రైతు సంఘం నాయకులు హెచ్చరిస్తు న్నారు. భూములు అమ్ముకు న్న రైతులు కూలీలుగా మారే పరిస్థితులు వస్తాయంటున్నా రు. భూములు కొనుగోలు చేసే విధానంపై ప్రభుత్వం కొన్ని పరిమితులు విధిం చాలని సూచిస్తున్నారు.

నేడు ఎకరం అమ్మితే రేపు గజం కూడా కొనలేరు..

- ఇర్రి రమణారెడ్డి, రైతుబంధు సమితి జిల్లా కోఆర్డినేటర్‌

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక రైతాంగం కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతోంది. కరువు నేలగా ఉన్న జనగామను గోదావరి జలాలతో తడిపింది. పంటలు పండించుకునేందుకు అనేక అవకాశాలు ఏర్పడ్డాయి. ఈ సమయంలో రైతులు భూములు అమ్ముకోవటం ఆపాలి. ఎక్కువ డబ్బులు వస్తున్నాయని ఆశపడితే భవిష్యత్‌లో ఇబ్బందిపడుతారు. నేడు ఎకరం భూమి అమ్ముకున్నవారు రేపు గజం కూడా కొనలేని పరిస్థితులు వస్తాయి. అయితే సాగుకు యోగ్యం కాని భూములు అమ్ముకుంటే నష్టం లేదు.

Updated Date - 2022-12-13T23:50:22+05:30 IST

Read more