రోడ్డు ప్రమాదంలో తాత, మనుమరాలి మృతి..

ABN , First Publish Date - 2022-12-09T23:35:02+05:30 IST

మనుమరాలికి జ్వరం రావడంతో పక్కఊరిలో గ్రామీణ వైద్యుడి వద్ద కు తీసుకెళ్తున్న నాయనమ్మ, తాత ద్విచక్రవాహనంపై బయలుదేరగా.. సిమెంట్‌ లారీ వీరి వాహనాన్ని ఢీ కొట్టడంతో తాత, మనువరాలు మృత్యువాతపడగా.. నాయనమ్మ తీవ్ర గాయాలతో చిక్సిత్స పొందుతోంది. ఈ ఘటన శుక్రవారం ఉదయం వరంగల్‌ జిల్లా న ర్సంపేట మండలం ఇటుకాలపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం వివరాలిలావున్నాయి.

రోడ్డు ప్రమాదంలో  తాత, మనుమరాలి మృతి..
చిన్నారి పూర్ణితలక్ష్మి, పాచ్య (ఫైల్‌)

బైక్‌ను ఢీ కొట్టిన సిమెంట్‌ లోడ్‌ లారీ

నర్సంపేట టౌన్‌, డిసెంబరు 9 : మనుమరాలికి జ్వరం రావడంతో పక్కఊరిలో గ్రామీణ వైద్యుడి వద్ద కు తీసుకెళ్తున్న నాయనమ్మ, తాత ద్విచక్రవాహనంపై బయలుదేరగా.. సిమెంట్‌ లారీ వీరి వాహనాన్ని ఢీ కొట్టడంతో తాత, మనువరాలు మృత్యువాతపడగా.. నాయనమ్మ తీవ్ర గాయాలతో చిక్సిత్స పొందుతోంది. ఈ ఘటన శుక్రవారం ఉదయం వరంగల్‌ జిల్లా న ర్సంపేట మండలం ఇటుకాలపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం వివరాలిలావున్నాయి.

నర్సంపేట మండలం ఆకులతండా గ్రామానికి చెం దిన ధరావత్‌ పాచ్య (65), నాగమ్మ అలియాస్‌ లక్ష్మి దంపతులకు ఇద్దరు కుమారులు యాకూబ్‌, అశోక్‌, ముగ్గురు కూతుర్లు ఉన్నారు. పెద్ద కుమారుడు యా కూబ్‌ సీఆర్‌పీఎఫ్‌ కానిస్టేబుల్‌గా ములుగు జిల్లా వెం కటాపురం పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్నాడు. యాకూబ్‌-దివ్య దంపతులకు నాలుగేళ్ల క్రితం వివా హం కాగా, ఏకైక కూతురు పూర్ణితలక్ష్మి (3) ఉంది. వీరి కుటుంబం ఆకులతండాలోని పాచ్య ఇంటి వద్దనే ఉంటున్నారు. చిన్నారి పూర్ణితలక్ష్మికి జ్వరం రావడంతో సమీపంలోని ఇటుకాలపల్లిలో ఆర్‌ఎంపీ వైద్యుని వద్ద కు శుక్రవారం ఉదయం పాచ్య తన ద్విచక్రవాహ నం (టీవీఎస్‌ ఎక్సెల్‌)పై మనుమరాలిని, భార్య నాగ మ్మ తీసుకెళ్తాడు. ఇటుకాలపల్లి గ్రామ ప్రధాన కూడ లి వద్ద మల్లంపల్లి నుంచి నర్సంపేట వైపు వస్తున్న సిమెంట్‌ లోడ్‌ లారీ పక్క నుంచి వెళ్తూ ద్విచక్రవాహ నాన్ని ఢీ కొట్టింది. ద్విచక్రవాహనంపై నుంచి ఎగిరి కొద్ది దూరంలో కింద పడడంతో పూర్ణితలక్ష్మికి తలకు బలమైన గాయమై అపస్మారక స్థితిలోకి వెళ్లింది. ద్వి చక్రవాహనాన్ని నడుపుతున్న పాచ్యకు తీవ్ర గాయా లు కాగా నాగమ్మకి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రు లను నర్సంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా పూర్ణి తలక్ష్మి అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారిం చారు. పాచ్యను ఆస్పత్రి నుంచి ఎంజీఎంకు తరలిస్తుం డగా మార్గమధ్యంలో మృతి చెందాడు. తీవ్రంగా గా యపడిన నాగమ్మ ఎంజీఎంలో చికిత్స పొందుతోంది. పూర్ణితలక్ష్మి తల్లి దివ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని మృతదేహాలను పోస్టుమార్టంనకు తరలించి నట్లు టౌన్‌ సీఐ పులి రమేష్‌ తెలిపారు.

ఆకులతండాలో విషాదం

రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబంలో ఇద్దరు మృతి చెందడంతో మృతుల స్వగ్రామం ఆకులతండాలో విషా దం అలుముకుంది. గత నెల 22న చిన్నారి పూర్ణిత లక్ష్మి జన్మదిన వేడుకలను ఆనందోత్సాహాల నడుమ జరుపుకొని కుటుంబమంతా ఆనందంగా ఉంటుండగా శుక్రవారం లారీ రూపంలో మృత్యువు తాత, మనుమ రాలిని కబలించి ఆ కుటుంబంలో విషాదాన్ని నింపిం ది. కాగా, శుక్రవారం రాత్రి ఆకులతండాలో మృతులకు అంత్యక్రియలు నిర్వహించారు.

Updated Date - 2022-12-09T23:35:04+05:30 IST