టార్గెట్‌ గొత్తికోయలు

ABN , First Publish Date - 2022-11-27T00:35:42+05:30 IST

గొత్తికోయలు, వారు వాడే మారణాయుధాలతో ప్రాణాపాయమంటూ ఆందోళన స్వ రాష్ర్టాలకు పంపించాలని డిమాండ్‌

టార్గెట్‌ గొత్తికోయలు

ములుగు, నవంబరు 26 : ఏజెన్సీలో నిశ్శబ్ద యుద్ధం జరుగుతోంది. దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో అటవీశాఖ రేంజ్‌ అధికారి హత్యోదంతంతో గొత్తికోయలు టార్గెట్‌ అయ్యారు. అడవులు, వన్యప్రాణులకే కాదు మాకూ వారితో ప్రాణాపాయం ఉందంటూ అటవీశాఖ సిబ్బంది అంటున్నారు. ఏళ్ల కాలంగా వలసజీవులైన గొత్తికోయలను లక్ష్యంగా చేసుకున్న ఫారెస్టోళ్లు ఎఫ్ఫార్వో హత్య ఘటనను ప్రధానంగా చూపిస్తూ వారిని వెళ్లగొట్టేందుకు గట్టిగానే ప్రయత్నిస్తున్నారు.

ములుగు జిల్లాలో 73 ఆవాసాలు..

గోదావరి పరివాహకంలో ఉన్న ములుగు జిల్లా ఛత్తీస్‌గఢ్‌తో సరిహద్దును కలిగి ఉంది. సాల్వాజుడుం- మావోయిస్టుల మధ్య సుదీర్ఘకాలం జరిగిన యుద్ధంతో ప్రాణాలరచేతపట్టుకొని ములుగు అరణ్యాలకు వచ్చిన అనేక గొత్తికోయ కుటుంబాలు ఇక్కడ ఆశ్రయం పొం దాయి. ఒకరి తర్వాత ఒకరు ఇలా పదేళ్లక్రితం నుంచి వలసలు కొనసాగాయి. ప్రస్తుతం జిల్లాలోని తొమ్మిది మండలాల్లో 73కుపైగా ఆవాసాలను ఏర్పాటుచేసుకు న్నారు. వీరి జనాభా 15వేల పైనే ఉందని అంచనా.

విచ్చలవిడిగా పోడు, వేట..

సంచార వ్యవసాయం, వన్యప్రాణుల వేట గొత్తికో యల జీవన విధానంలో ముఖ్యమైనవి. నీటి ఆవాసా లుండే దట్టమైన అడవుల్లో నివాసం ఏర్పాటుచేసుకునే వారు అక్కడి చెట్లను నరికి తిండికోసం వరి, జొన్న, కూరగాయలను సాగుచేస్తారు. వన్యప్రాణులను వేటాడటం సర్వసాధా రణం. వేట, క్రూర మృగాల నుంచి రక్షణ కోసం వారు పదునైన ఆయుధాలను కలిగి ఉంటారు. ఈనేపథ్యం లో జిల్లాలో పోడు వ్యవసాయం విచ్చలవిడిగా పెరిగి పోయింది. వీరిని ముందుపెట్టి పలువురు గిరిజనులు, గిరిజనేతరులు, దళారులు పెద్దఎత్తున చెట్లను నరికి వేయించారు. ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా 12వేల ఎకరా ల విస్తీర్ణంలో గొత్తికోయలు భారీ వృక్షాలను కూల్చి చదునుచేసినట్లు అటవీ శాఖ చెబుతోంది. మాంసం కోసం పందులు, జింకలు, కుందేళ్లు, మెకాలను నిత్యం వేటాడుతుంటారు. సంప్రదాయ ఉచ్చులతో పాటు కరెంటును కూడా వాడుతున్న సంఘటనలు అనేకం వెలుగు చూశాయి. వేట గుట్టుగా సాగుతుండగా అడపాదడపా వేటగాళ్లు ఫారెస్టు, పోలీసు అధికారు లకు చిక్కుతున్నారు.

సంచలనం కలిగించిన పెద్దపులి హత్య

గతేడాది తాడ్వాయి మండలం కొడిశాల అభయార ణ్యంలో పెద్దపులి హత్య కలకలం రేపింది. క్లచ్‌వైర్‌తో తయారుచేసిన ఉచ్చులతో పెద్దపులిని హతమార్చిన ఈఘటన అక్టోబరు నెలలో వెలుగుచూసింది. పులిచ ర్మం, గోళ్లను విక్రయించే క్రమంలో పదిమంది గొత్తికో యలను అటవీశాఖ అధికారులు అరెస్టుచేసి జైలుకు పంపించారు. జిల్లా వ్యాప్తంగా గొత్తికోయ గూడాలను జల్లెడపట్టి పెద్దసంఖ్యలో బానాలు, బరిసెలు, గొడ్డళ్లు, కత్తులు, ఉచ్చులు, తదితర మారణాయుధాలను స్వా ధీనపర్చుకున్నారు. పులి కొవ్వుతో గొత్తికోయలు తయా రుచేసిన నూనె కూడా లభ్యమవ్వడం గమనార్హం.

జలగలంచ దాష్టీకం..

అటవీశాఖ గొత్తికోయలను తమ ప్రధాన శత్రువు లుగా భావిస్తోందనడంలో అనుమానం లేదు. అంతరి స్తున్న అడవులు, వన్యప్రాణులకు వారే కారణమని బలంగా చెబుతున్నారు అధికారులు. ఈక్రమంలో గత కొన్నేళ్లలో గూడాలు, వ్యక్తులపై దాడులు జరిపారు. గుడిసెలను పీకేసి నిప్పుకూడా పెట్టారు. తాడ్వాయి మండలం జలగలంచ గొత్తికోయగూడెంలో ఆదివాసీ మహిళలను చెట్టుకు కట్టేసి కొట్టిన ఘటన అటవీశాఖ సిబ్బంది దాష్టీకానికి పరాకాష్ట అని ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీలు ఆరోపించాయి.

ఫలితాన్నివ్వని గూడాల తరలింపు

గొత్తికోయలను బాహ్యప్రపంచంలోకి తీసుకువచ్చే ప్రభుత్వాధికారుల ప్రయత్నం సఫలం కాలేదు. గ్రామాలలో నివాసం, మౌలిక వసతులు కల్పిస్తామని చెప్పినా వారు అడవిని వదిలి రావడంలేదు. ఇదే సమయంలో మావోయిస్టుల ఏరివేతలో నిత్యం అడవు ల్లో కూంబింగ్‌చేస్తున్న పోలీసు శాఖ గొత్తికోయ గూడా లపై నజర్‌ వేసింది. నక్సల్స్‌కు ఈగూడాల్లో ఆశ్రయం లభిస్తోందని భావిస్తున్న పోలీసులు కోయలను మచ్చి క చేసుకుంటున్నారు. వారికి నిత్యావసరాలను పంపిణీ చేయడమే కాకుండా వైద్యశిబిరాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. అటవీసంపదకు ప్రమాదకారులుగా మారుతున్నారంటూ గొత్తికోయలను అటవీశాఖ లక్ష్యంగా చేసుకుంటే పోలీసు శాఖ అండగా నిలుస్తుండటం, కొన్ని రాజకీయ పార్టీలు వెనకేసుకు వస్తుండటం వంటి పరిణామాలు వారికి మింగుడుపడటంలేదు.

‘వారుంటే మేం డ్యూటీ చేయం..’

గొత్తికోయలతో తమకు ప్రాణాపాయం ఉందని, వారిని సొంత రాష్ట్రాలకు పంపిస్తేనేగాని విధులు నిర్వర్తిం చలేమని ములుగు జిల్లా అటవీశాఖ అధికారులు, సిబ్బంది అంటున్నారు. రేంజ్‌ అధికారి శ్రీనివాసరావు హత్య నేపథ్యంలో ములుగు జిల్లా ఫారెస్టు కార్యాలయం ఆవరణలో గొత్తికోయలు వాడే మారణాయుధాలను ఫారెస్టు అధికారులు ప్రదర్శించారు. తాడ్వాయి అడవుల్లో పెద్దపులి హత్య నేపథ్యంలో గొత్తికోయగూడాల్లో తనిఖీలు జరిపి న అటవీ అధికారులు వారినుంచి స్వాధీనం చేసుకున్న పదుల సంఖ్యలో విల్లంబులు, బల్లాలు, వన్యప్రాణుల వేటకుఉపయోగించే ఉచ్చులు, తీగలను ప్రదర్శించారు. వన్యప్రాణుల వేట కోసం వారు ఉపయోగించే ఆయుధా లు అత్యంత ప్రమాదకరంగా ఉంటాయని డీఎఫ్‌వో కిష్టాగౌడ్‌ పేర్కొన్నారు. విధి నిర్వహణలో భాగంగా ఒకరి ద్దరు అధికారులు మాత్రమే అడవుల్లోకి వెళతారని, అక్రమ పోడు, చెట్ల నరికివేతను అడ్డుకునే క్రమంలో గొత్తికో యలతో ఏదైనా గొడవ జరిగితే అటవీశాఖ సిబ్బందికి ప్రమాదమేనని తెలిపారు. రేంజ్‌ అధికారి హత్యకు నిర సనగా విధులను బహిష్కరిస్తున్న అటవీ సిబ్బంది గొత్తికోయలనే టార్గెట్‌ చేస్తూ వ్యూహాత్మకంగా ఆయుధాలను ప్రదర్శించడం చర్చనీయాంశంగా మారింది..

Updated Date - 2022-11-27T00:53:35+05:30 IST