అర్హులను ఓటర్లుగా నమోదు చేయించాలి

ABN , First Publish Date - 2022-12-08T00:10:27+05:30 IST

ప్రత్యేక ఓటరు సవరణ జాబితా-2023 రూపకల్పనలో అర్హతగల ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదయ్యేలా చూడాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికా్‌సరాజ్‌ సూచించారు. బుధవారం హనుమకొండ కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జాయింట్‌ సీఈవో రవికిరణ్‌తో కలిసి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.

అర్హులను ఓటర్లుగా నమోదు చేయించాలి
సమావేశంలో మాట్లాడుతున్న ఎన్నికల అధికారి వికాస్‌ రాజ్‌

హనుమకొండ రూరల్‌, డిసెంబరు 7: ప్రత్యేక ఓటరు సవరణ జాబితా-2023 రూపకల్పనలో అర్హతగల ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదయ్యేలా చూడాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికా్‌సరాజ్‌ సూచించారు. బుధవారం హనుమకొండ కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జాయింట్‌ సీఈవో రవికిరణ్‌తో కలిసి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎన్నికల అధికారి వికాస్‌ రాజ్‌ మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా జిల్లాస్థాయి నుంచి గ్రామస్థాయిలో ఓటరు నమోదు అవగాహన, ప్రచార కార్యక్రమాలు చేపట్టడంతోపాటు ప్రత్యేక ఓటరు నమోదును చేపట్టినట్లు తెలిపారు. ప్రతీ ఓటరు దరఖాస్తుకు ఒక ఫైల్‌ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. బీఎల్‌ఓలు విధుల్లో అలసత్వం వహించకుండా సక్రమంగా నిర్వహించాలన్నారు. పోలింగ్‌ సెంటర్లలో బీఎల్‌ఓ వివరాలు, సెల్‌ నెంబర్‌ తప్పకుండా ఉండాలన్నారు. రాజకీయపార్టీలు వ్యక్తం చేసిన సందేహాలను నివృత్తి చేసి పరిష్కరించడానికి ఎన్నికల కమిషన్‌ ఎల్లప్పుడు సిద్ధంగా ఉంటుందని తెలిపారు. డూప్లికేట్‌ ఓట్లను తొలగిస్తూ, ఓటరుకార్డుకు ఆధార్‌ లింకేజీ పూర్తి స్థాయిలో చేయాలన్నారు. బీఎల్‌ఓలు, బీఎల్‌ఏలు ఓటర్లకు అందుబాటులో ఉండే విధంగా చూడాలని రాజకీయ పార్టీల ప్రతినిధులు ఆయన దృష్టికి తీసుకొచ్చారు.

అనంతరం హనుమకొండ జిల్లా కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ మట్లాడుతూ.. కొత్తగా ఓటరు నమోదుకు, సవరణలకుగాను విస్తృత ప్రచారం నిర్వహించామన్నారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఇతర అభ్యంతరాలను పరిశీలించి తుది జాబితాను పకడ్బందీగా రూపొందిస్తున్నామని తెలిపారు. వరంగల్‌ జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ గోపి మాట్లాడుతూ.. ఓటరు నమోదుకు జిల్లా యం త్రాంగం అన్ని చర్యలు తీసుకుంటోందన్నారు. స్వీప్‌ కార్యక్రమాలు జిల్లా వ్యాప్తంగా చేపట్టినట్లు తెలిపారు. ఓటరు నమోదుపై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో క్రమం తప్పకుండా సమావేశం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. స్పెషల్‌ సమ్మరి రివిజన్‌పై అధికారులు పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇచ్చారు.

ఈ సమావేశంలో మునిసిపల్‌ కమిషనర్‌ ప్రావీణ్య, హనుమకొండ అదనపు కలెక్టర్‌ సంధ్యారాణి, డీఆర్‌ఓ వాసుచంద్ర, డీఆర్‌డీఏ పీడీ శ్రీనివాస్‌ కుమార్‌, కాంగ్రెస్‌ పార్టీ నుంచి నాయిని రాజేందర్‌రెడ్డి, ఇవి.శ్రీనివాస్‌, బీజేపీ నుంచి రావు పద్మ, అమరేందర్‌రెడ్డి, సీపీఐ బండి పుల్లయ్య, టీఆర్‌ఎస్‌ డాక్టర్‌ ఇండ్ల నాగేశ్వర్‌రావు, రామూర్తి, సీపీఎం మచ్చ లక్ష్మణ్‌, టీడీఈప నుంచి కుసుమ శ్యాంసుందర్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-12-08T00:10:28+05:30 IST