రాష్ట్రంలో నియంతపాలన

ABN , First Publish Date - 2022-11-24T23:26:32+05:30 IST

ఒక్క పథకం కూడా సరిగా అమలు చేయడం లేదు.. రాష్ట్రంలో అప్పులేని అన్నదాత అంటూ లేడు రూ.5వేలు ఇచ్చి రైతులను రాజును చేశా అనడం సిగ్గుచేటు సీఎంకు ప్రతిపక్షాలు అమ్ముడుపోయాయి తెలంగాణలో వైఎస్సార్‌ లేని లోటు ప్రజలు ఆదరిస్తే సంక్షేమ పాలనను తీసుకొస్తాం వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వై.ఎస్‌.షర్మిల

రాష్ట్రంలో నియంతపాలన

చెల్పూరు, నవంబరు 24: రాష్ట్రంలో నియం త పాలన కొనసాగుతోందని వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వై.ఎస్‌.షర్మిల విమర్శించారు. ప్ర జా సంక్షేమాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ గాలికి వదిలేశారని దుయ్యబట్టారు. షర్మిల చేపట్టిన ప్రజా ప్రస్థానం పాదయాత్ర జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో నాలుగో రోజూ కొనసాగింది. గురు వారం భూపాలపల్లి పట్టణ పరిధి మం జూర్‌నగర్‌ నుంచి ప్రారంభమైంది. 8ఇన్‌క్లైన్‌ రహదారి, బొబ్బలోనిపల్లి, పరుశురాంపల్లి, ధర్మరావుపేట మీదుగా గణపురం మండల కేంద్రానికి చేరుకుంది. ఈ సందర్భంగా ప్రజలతో షర్మిల మమే కమయ్యారు. వారితో మాటామంతీ కార్యక్రమాన్ని చేప ట్టారు. రాష్ట్రంలో అభివృద్ధి ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రాజెక్టుల పేరుతో దండుకోవడం తప్ప ప్రజా సమస్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సోయి లేదని ఆరోపించారు. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి అమలు చేసిన ప్రజా సంక్షేమ పథకాలన్నింటినీ నిర్వీర్యం చేశారని విమర్శించారు. రెండుసార్లు అధికారంలోకి వచ్చిన కేసీఆర్‌ ప్రజాసంక్షేమాన్ని విస్మరించారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో అప్పులేని రైతు అంటూ లేడ న్నారు. ఎన్నికల సమయంలోనే కేసీఆర్‌కు రైతు రుణ మాఫీ గుర్తుకొస్తుందని, అధికారం చేపట్టాక ఆ విషయాన్ని విస్మరిస్తార ని విమర్శించారు. రూ.5 వేలు ఇచ్చి రైతు లను రాజును చేస్తున్నానని అనడం సిగ్గుచేటన్నారు. రూ. 40 వేల వ్యవసాయ సబ్సిడీలన్నింటినీ నిలిపివేసి రూ.5 వే లతో మాత్రమే రైతుబంధు పథకాన్ని అందించడం విడ్డూరమన్నారు. రాష్ట్రంలో ఒక్క సంక్షేమ పథకం కూడా సక్రమంగా అమలు కావడం లేదని విమర్శించారు. కేసీఆర్‌ మాటలను ఎవరూ నమ్మొ ద్దన్నారు. గాడిదకు రంగు వేసి ఆవు అని నమ్మించేందు కు ఆయన ప్రయత్నిస్తారని వ్యాఖ్యానించారు. ఎన్నికల సమయంలోనే కేసీఆర్‌ బయటకు వస్తారని, ఆ తర్వాత ఫామ్‌హౌస్‌కే పరిమితమవుతారని అన్నారు.

ఆ పార్టీలు ఉండి ఏం ప్రయోజనం..?

రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు ఉండి కూడా ప్రయోజనం శూన్యమని షర్మిల వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష పాత్రను పోషిం చాల్సిన ఆ పార్టీలు కేసీఆర్‌ కు అమ్ముడు పోయాయని ఆరోపించారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని నిలదీయకపోవడంతో కేసీఆర్‌కు ఆడిందే ఆట పాడిందే పాట అయ్యిందన్నారు. ప్రజా సమస్యలపై పోరాడటం బీజేపీ, కాంగ్రెస్‌లాంటి ప్రతిపక్షాలు ఎప్పుడో మానేశాయన్నారు.

గండ్రకు దందాలే తెలుసు..

ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డికి దందాలు తప్ప పరిపాలన పట్టదని షర్మిల దుయ్యబట్టారు. నియోజక వర్గ అభివృద్ధికి ఆయన చేసిందేమీ లేదన్నారు. స్వప్ర యోజనాలు తప్ప ప్రజా సమస్యలపై ఆయనకు చిత్తశు ద్ధి లేదని విమర్శించారు. ఏ ఒక్కరోజు కూడా ప్రజల బాగోగులు చూసిన పాపానికి పోలేదని ధ్వజమెత్తారు.

వైఎస్సార్‌ పాలన రావాలి

దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌ అందించిన పాలన ప్రజల్లో చిరస్థాయిగా నిలుస్తాయన్నారు. ఫీజు రియింబర్స్‌మెంట్‌ పథకంతో పేదలు సైతం ఉన్నత విద్యను అభ్యసించి ఉపాధిని పొందారని గుర్తు చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని కేసీఆర్‌ ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసిందని విమర్శించారు. రాష్ట్రంలో మళ్లీ వైఎస్సార్‌ పాలన రావాలని అన్నారు. వైఎస్సార్‌టీపీని ప్రజలు ఆదరించి అధికారం కట్టబెడితే వైఎస్‌ పథకాలన్నింటినీ మళ్లీ ప్రవేశపెడతామని హామీ ఇచ్చారు. తాము అధికారంలోకి రాగానే మొదట యువతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తామన్నారు. నిలువనీడలేని ప్రతి నిరుపేద మహిళ పేరు మీద పక్కా ఇళ్లు నిర్మిస్తామన్నారు. ఇంట్లో ఎంత మంది ఉంటే అంతమంది వృద్ధులు, దివ్యాంగులకు పింఛన్లు ఇస్తావన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు అప్పం కిషన్‌ తదితరులు పాల్గొన్నారు.

భూపాలపల్లిలో జిల్లాలో నేడు ముగింపు

షర్మిల పాదయాత్ర గురువారం సాయంత్రం వరకు వెల్తుర్లపల్లి క్రాస్‌ రోడ్డుకు చేరుకుంది. రాత్రి బస అనంతరం శుక్రవారం ఉదయాన్నే జిల్లాలో ఐదో రోజు పాదయాత్ర కొనసాగనుంది. ఉదయం 8:30 పాదయాత్ర మళ్లీ ప్రారంభమై బుద్దారం బీసీకాలనీ, 10 గంటలకు బుద్దారం గ్రామంలో కొనసాగనుంది.

నేడు ములుగు జిల్లాలో ప్రారంభం

ములుగు : వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వై.ఎస్‌.షర్మిల చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్ర శుక్ర వారం జిల్లాలో కొనసాగనుంది. ఉదయం 10.30 గంటల కు వెంకటాపూర్‌(రామప్ప) మండలం చాతరాజుపల్లి గ్రామం వద్ద పాదయాత్ర ములుగు జిల్లాలోకి ప్రవేశి స్తుంది. నర్సాపూర్‌, సింగరకుంటపల్లి, ములుగు మండ లం బండారుపల్లి మీదుగా జిల్లాకేంద్రం వరకు యాత్ర కొనసాగనుంది. సాయంత్రం 4గంటలకు ప్రభుత్వ ఏరి యా ఆస్పత్రి కూడలిలో జరిగే రోడ్‌షోలో షర్మిల ప్రజల ను ఉద్దేశించి మాట్లాడనున్నారు. రాత్రి ఇక్కడే బస చేసి షెడ్యూల్‌ ప్రకారం మరుసటి రోజు పాదయాత్ర కొనసా గించనున్నారు.

Updated Date - 2022-11-24T23:26:32+05:30 IST

Read more