పేదలకు భూమి దక్కే వరకు పోరాటం

ABN , First Publish Date - 2022-11-28T00:19:34+05:30 IST

పేదలకు భూములు దక్కేవరకు భూ పోరాటం ఆపేదిలేదని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్‌రెడ్డి చెప్పారు. బొల్లికుంటలో మండల పార్టీ కార్యదర్శి దండు లక్ష్మణ్‌ అధ్యక్షతన ఆదివారం ఏర్పాటు చేసిన భూ పోరాట సదస్సుకు వెంకటరెడ్డి మఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. పేదలు వేసుకున్న గుడిసెలకు పట్టాలు ఇచ్చి, ఇళ్లు నిర్మించే వరకు పోరాటం చేస్తామన్నారు. భూ కబ్జాదారులు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు ప్రభుత్వ భూములను ఆక్రమించి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం సాగిస్తుంటే వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. పేదలు 60 గజాల ఇంటి స్థలం కోసం పోరాడుతంటే పోలీసు అధికారులు ప్రతాపం చూపిస్తున్నారని మండిపడ్డారు. సీపీఐ ఆధ్వర్యంలో పోరాటాలు చేసిన జీవో58 ప్రకారం ఇళ్ల స్థలాలు ఇవ్వాలన్నారు.

పేదలకు భూమి దక్కే వరకు పోరాటం
బొల్లికుంటలో మాట్లాడుతున్న చాడ వెంకట్‌రెడ్డి

మామునూరు, నవంబరు 27: పేదలకు భూములు దక్కేవరకు భూ పోరాటం ఆపేదిలేదని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్‌రెడ్డి చెప్పారు. బొల్లికుంటలో మండల పార్టీ కార్యదర్శి దండు లక్ష్మణ్‌ అధ్యక్షతన ఆదివారం ఏర్పాటు చేసిన భూ పోరాట సదస్సుకు వెంకటరెడ్డి మఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. పేదలు వేసుకున్న గుడిసెలకు పట్టాలు ఇచ్చి, ఇళ్లు నిర్మించే వరకు పోరాటం చేస్తామన్నారు. భూ కబ్జాదారులు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు ప్రభుత్వ భూములను ఆక్రమించి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం సాగిస్తుంటే వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. పేదలు 60 గజాల ఇంటి స్థలం కోసం పోరాడుతంటే పోలీసు అధికారులు ప్రతాపం చూపిస్తున్నారని మండిపడ్డారు. సీపీఐ ఆధ్వర్యంలో పోరాటాలు చేసిన జీవో58 ప్రకారం ఇళ్ల స్థలాలు ఇవ్వాలన్నారు. సీఎం ఆదేశాలతోనే భూపారాట కేంద్రాలపై పోలీసుల దాడులు నిలిచి పోయాయని వెంకట్‌రెడ్డి వివరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు తక్కళ్లపల్లి శ్రీనివాసరావు, వరంగల్‌ జిల్లా పార్టీ కార్యదర్శి మేకల రవి, హనుమకొండ జిల్లా పార్టీ కార్యదర్శి కర్రె భిక్షపతి, జిల్లా సహాయ కార్యదర్శి హేక్‌ బాషుమియా, పనాస ప్రసాద్‌, నాయకులు తాళ్లపల్లి జాన్‌పాల్‌, కండె నర్సయ్య, ఒర్సు రాజు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-28T00:19:36+05:30 IST