టీఆర్‌ఎస్‌ను ప్రజలు విశ్వసించడం లేదు

ABN , First Publish Date - 2022-11-28T00:16:58+05:30 IST

సీఎం కేసీఆర్‌ను ప్రజలు విశ్వసించడం లేదని, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు అర్థమయ్యేలా కార్యకర్తలు వివరించాలని భారతీయ జనతాపార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి చందుపట్ల కీర్తిరెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఆదివారం వరంగల్‌ ఖమ్మం రోడ్‌లోని రాజశ్రీ గార్డెన్‌లో పార్టీ జిల్లా అధ్యక్షుడు కొండేటి శ్రీధర్‌ అధ్యక్షతన జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. ముఖ్యఅతిథి కీర్తిరెడ్డి మాట్లాడుతూ... ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై ప్రజలు విసిగుచెందారని, ఇదే అదనుగా కార్యకర్తలు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలన్నారు.

టీఆర్‌ఎస్‌ను ప్రజలు   విశ్వసించడం లేదు

- ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలి...

-కేంద్ర పథకాలపై విస్తృత ప్రచారం చేయాలి...

- బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కీర్తిరెడ్డి

వరంగల్‌ సిటీ, నవంబరు 27: సీఎం కేసీఆర్‌ను ప్రజలు విశ్వసించడం లేదని, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు అర్థమయ్యేలా కార్యకర్తలు వివరించాలని భారతీయ జనతాపార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి చందుపట్ల కీర్తిరెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఆదివారం వరంగల్‌ ఖమ్మం రోడ్‌లోని రాజశ్రీ గార్డెన్‌లో పార్టీ జిల్లా అధ్యక్షుడు కొండేటి శ్రీధర్‌ అధ్యక్షతన జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. ముఖ్యఅతిథి కీర్తిరెడ్డి మాట్లాడుతూ... ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై ప్రజలు విసిగుచెందారని, ఇదే అదనుగా కార్యకర్తలు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలన్నారు. కేంద్రం విడుదల చేస్తున్న నిధులతోనే ప్రభుత్వం కమీషన్ల పనులను చేపడుతూ, కేంద్రం నిధులు ఇవ్వడం లేదనడం విడ్డూరంగా ఉందన్నారు. గ్రామాల అభివృద్ధికి చేపట్టాల్సిన 65 రకాల పనుల కోసం కేంద్రం 15, 16 ఆర్థిక సంఘం నిధులను విడుదల చేస్తుంటే వాటితో రాష్ట్ర ప్రభుత్వం కమీషన్ల కోసం ప్రత్యేకమై పనులను చేపడుతుందని దుయ్యబట్టారు. రూ.4వేలకు తయారయ్యే యూరియా బస్తాను రైతులకు రూ.18 వందలకే అందజేస్తూ రూ. 22 వందలను సబ్సిడీగా కేంద్రం అందిస్తోందని గ్రోమోర్‌ యూరియా బస్తాను చూపిస్తూ వివరించారు. ఇంతచేస్తున్నా బస్తాలపై కేంద్రం ఎలాంటి ముద్రలు వేసుకోలేదని, అదే కేసీఆర్‌ రూపాయి సబ్బిడీ ఇచ్చినా కేసీఆర్‌, కేటీఆర్‌, కవిత, కారు ఫొటోలను బస్తాలపై ముద్రించి ప్రచారం చేసుకునేవాడని ఎద్దేవా చేశారు.

ఎరువులపై కేంద్రం సబ్సిడీ..

కేంద్ర ప్రభుత్వం సాలీన రూ. 90 వేల కోట్ల సబ్సిడీని ఎరువులపై ఇస్తోందని కీర్తిరెడ్డి వెల్లడించారు. రైతులకు ఎరువులు ఉచితంగా ఇచ్చేందుకే పుట్టానన్న కేసీఆర్‌ ఏ మాత్రం ఎరువులు ఉచితంగా ఇచ్చారని ఆమె ప్రశ్నించారు. మునుగోడు ఎన్నికల నేపథ్యం లో ప్రకటించిన పింఛన్లలో ఇప్పుడు లక్ష మంది పింఛన్లు మాయయ్యాయన్నారు. ట్రాక్టర్‌ ఉన్నోడికి పింఛన్‌ కట్‌ చేస్తున్న కేసీఆర్‌ బెంజ్‌ కారులో వచ్చి రైతుబంధు ఎలా తీసుకుంటాడన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే ప్రతీ ఇంట్లో అర్హులైన వారందిరికీ పింఛన్లు మంజూరు అవుతాయన్నారు.

దోచుకుంటున్న సర్కారు..

ఆబ్కారీశాఖ నుంచి రూ.45కోట్ల మేర ఆదాయం పొందుతున్న సర్కారు రైతుబంధుకు రూ. 25వేల కోట్లు, పింఛన్లకు రూ.12వేల కోట్లు మాత్రమే ఖర్చు చేసి, మిగతా సగం దోచుకుంటున్నారని ఆరోపించారు. బీజేపీ నూతనంగా ఏర్పాటు చేస్తున్న కమిటీల్లోకి కమిట్‌ మెంట్‌ ఉన్న కార్యకర్తలను తీసుకోవాలని ఆమె సూచిం చారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి, ఎడ్ల అశోక్‌రెడ్డి, డాక్టర్‌, విజయ్‌చందర్‌రెడ్డి, కుసుమ సతీష్‌, ఎర్రబెల్లి ప్రదీప్‌రావు, రత్నం సతీష్‌సా, బి. హరిశంకర్‌, బి. శ్యాంసుందర్‌, రాజేశ్వర్‌రావు, శ్రీనివాస్‌ గుప్తా, కె.రంజిత్‌, కేశవరెడ్డి, అజయ్‌కుమార్‌, తిరుపతిరెడ్డి, ప్రభాకర్‌, నరసింహులు, మండల, డివిజన్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-28T00:17:21+05:30 IST