అయ్యప్ప వైభోగమే

ABN , First Publish Date - 2022-12-09T23:36:55+05:30 IST

అయ్యప్ప నామస్మరణతో నర్సంపేట మారు మో గింది. మాలధాదారులు, భక్తులతో శు క్రవారం సందడిగా మారింది. అయ్య ప్ప పంబారట్టు (జలక్రీడ) మాధన్న పేట చెరువులో కన్నులపండువగా జరి గింది. జల క్రీడలో భాగంగా అయ్యప్ప స్వామికి పాలు, పెరుగు, నెయ్యి, తేనె, బస్వం, పంచదార, గంధం, పసుపుతో అభిషేకం చేశారు.

అయ్యప్ప వైభోగమే

మాధన్న చెరువువద్ద పూజలు

నర్సంపేట, డిసెంబరు 9: అయ్యప్ప నామస్మరణతో నర్సంపేట మారు మో గింది. మాలధాదారులు, భక్తులతో శు క్రవారం సందడిగా మారింది. అయ్య ప్ప పంబారట్టు (జలక్రీడ) మాధన్న పేట చెరువులో కన్నులపండువగా జరి గింది. జల క్రీడలో భాగంగా అయ్యప్ప స్వామికి పాలు, పెరుగు, నెయ్యి, తేనె, బస్వం, పంచదార, గంధం, పసుపుతో అభిషేకం చేశారు.

నర్సంపేటలో అయ్యప్ప పంబారట్టు ఉత్సవాన్ని కన్నులపండువగా నిర్వ హించారు. కేరళ రాష్ట్రంలోని శబరి మలై సన్నిధానం సమీపంలోని పంబా నదిలో ఏ విధంగా జరుగుతుందో అదే రీతిలో ఉత్సవాలు జరిపారు. నర్సంపే టలోని శ్రీధర్మశాస్తా అయ్యప్పస్వామి దేవాలయంలో 22వ మండల పూజా మహోత్సవ (ద్వివింశతి) వేడుకల్లో భాగంగా పంబారట్టు మహాన్నదాత నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి చే వైభవంగా నిర్వహించారు. ఆలయ సేవాచారిటబుట్‌ ట్రస్టు చైర్మెన్‌ శింగిరి కొండ మాధవశంకర్‌, ఆలయ ట్రస్టు సభ్యుల నేతృత్వంలో తాంత్రిక వేత్త, గురుస్వామి సీహెచ్‌.వెంకటేశ్‌ శర్మ వేద మంత్రోచ్చరణల నడుమ జల, పుష్ప తాంత్రిక పూజలను నిర్వహించారు. ఉ దయం 9.30 నుంచి 11గంటల వరకు దేవాలయంలో ఎమ్మెల్యే పెద్ది సుదర్శ న్‌రెడ్డి దంపతులు పూజలు నిర్వహిం చారు. గర్భగుడిలోని అయ్యప్ప వి గ్రహాన్ని గురుస్వామి వెంకటేశ్‌శర్మ ఎమ్మెల్యేకు అందించగా ఆయన నెత్తిన ఎత్తుకొని ఆలంకరించిన రథం(ట్రాక్టర్‌)పై స్వామిని ప్రతిష్ఠించి రథాన్ని నడిపి ఊరేగింపును ప్రారంభించారు. కళాకారుల డప్పుచప్పుళ్లు, మహిళల కోలాట నృత్యాలు, డోలుకళాకారుల విన్యాసాలు, మాలధారుల నృత్యాల కమలాపురం సమీపంలోని మాధన్నపేట చెరువు వరకు సాగింది. స్వామివారి ఊరేగింపులో మాలధారులు ఒంటెపై ఊరేగడం ఆకట్టుకుంది.

కార్యక్రమంలో మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ గుంటి రజనికిషన్‌, వైస్‌చైర్మన్‌, మాలధారుడు మునుగాల వెంకట్‌రెడ్డి, జడ్పీ వైస్‌చైర్మన్‌ ఆకుల శ్రీనివాస్‌, మాజీ ఎంపీపీ నల్లా మనోహర్‌రెడ్డి, మాజీ మునిసిపల్‌ చైర్మెన్‌ నాగెల్లి వెంకటనారాయణగౌడ్‌, ఆలయ సేవా చారిటబుల్‌ ట్రస్టు చైర్మన్‌ శింగిరి కొండ మాధవశంకర్‌, రజని దంపతులు, కమిటీ సభ్యులు మాదారపు చంద్రశేఖరం, నందయ్య స్వామి, చింతల నిరంజన్‌, శ్రీరాంఈశ్వరయ్య, శ్రీరాంఈశ్వరయ్య, బూపతి లక్ష్మీనారాయణ, టీఆర్‌ఎస్‌ నాయకులు శ్రీనివాస్‌, బండి రమేశ్‌, కొంకీజ జ్ఞాన్‌సాగర్‌గౌడ్‌, నాగిశెట్టి ప్రసాద్‌, గోనె యువరాజ్‌, శివరాత్రి స్వామి తదితరులు పాల్గొన్నారు.

కనువిందుగా పంబారట్టు..

మాధన్నపేట చెరువులో మధ్యాహ్నం 12.30 నుంచి సాయంత్రం 3.30 గంటల వరకు అయ్యప్ప పంబారట్టు(జల క్రీడ) ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. చెరువులో ఏర్పాటు చేసిన వేదికపై అయ్యప్ప విగ్రహాన్ని ప్రతిష్ఠించి గురుస్వామి వెంకటేశ్‌శర్మ వేదమంత్రోచ్చరణల నడుమ అయ్యప్పస్వామిని కొలుస్తూ పాలు, పెరుగు, నెయ్యి, భస్మం(విభూది), పంచదార, చందనం, పసుపు, పండ్లు, తేనె, జలంతో వేలాదిగా తరలివచ్చిన మాళదారులు, భక్తుల సమక్షంలో అభిషేకం చేశారు. అభిషేక సమయంలో ఆకాశంలో గరుడ పక్షులు సంచరించడంతో అయ్యప్పస్వామి గరుడ రూపంలో వేడులకను తిలకించేందుకు వచ్చాడని చేతులు జోడించి స్వామియే శరణం అయ్యప్ప అంటూ స్మరించారు. చెరువు కట్టపై మాలధారులతో ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి పంబాసద్దిని (సహపంక్తి భోజనం) భుజించారు.

Updated Date - 2022-12-09T23:36:57+05:30 IST