బాబోయ్ Warangal MGMలో మరోసారి ఎలుకల సంచారం..

ABN , First Publish Date - 2022-09-08T16:53:30+05:30 IST

వరంగల్ ఎంజీఎం(MGM) ఆస్పత్రిలో రోగిపై ఎలుకలు(Rats) దాడి చేసిన ఘటన గురించి అందరికీ తెలిసిందే. ఈ ఘటన మరువక ముందే మరోసారి ఎలుకల బెడద రోగుల్ని వణికిస్తోంది. వివరాల్లోకి...

బాబోయ్ Warangal MGMలో మరోసారి ఎలుకల సంచారం..

Warangal: వరంగల్ ఎంజీఎం(MGM) ఆస్పత్రిలో రోగిపై ఎలుకలు(Rats) దాడి చేసిన ఘటన గురించి అందరికీ తెలిసిందే. ఈ ఘటన మరువక ముందే మరోసారి ఎలుకల బెడద రోగుల్ని వణికిస్తోంది. వివరాల్లోకి వెళ్తే..తెలంగాణ రాష్ట్రంలో రెండో అతిపెద్ద ప్రభుత్వ ఆస్పత్రి అయిన ఎంజీఎంలోని ఆర్‌ఐసీయూలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న హనుమకొండ జిల్లా భీమారం ప్రాంతానికి చెందిన కడార్ల  శ్రీనివాస్‌ అనే రోగి చేతి వేళ్లు, కాలివేళ్లు, ఇతర శరీర భాగాలను ఎలుకలు కొరికివేశాయి. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం అప్పటి సూపరింటెండెంట్​ డా.బి.శ్రీనివాసరావును తప్పించింది. కొత్త సూపరింటెండెంట్ వచ్చినా..ఎలుకల బెడదలో మాత్రం మార్పుల లేదు. ఈ సంఘటన తాలూకు దృశ్యాలు మన కళ్ల ముందే కదులుతున్న తరుణంలోనే మరోసారి ఎంజీఎంలో ఎలుకల స్వైరవిహారం బయటపడింది. 


తాజాగా..ఎంజీఎంలోని ఆస్పత్రిలో జనరల్ వార్డుల్లో ఎలుకల సంచారం కలకలం రేపుతోంది. పేషెంట్స్‌, సిబ్బందికి మూషికాలతో ముప్పుతిప్పలు పెడుతున్నాయి. శానిటేషన్ సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని తెలుస్తోంది. ఇన్ పేషెంట్స్ వార్డుల్లో ఎలుకలు తిరుగుతుండటంతో రోగుల బంధువులు మండిపడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్‌ చంద్రశేఖర్ శానిటేషన్ సిబ్బందిపై మండిపడ్డారు. ఎలుకల బెడద నుంచి శాశ్వత పరిష్కారం కోసం సిబ్బందిని సూపరింటెండెంట్ రంగంలోకి దింపింది అయినా.. నామమాత్రంగానే పనులు చేయడంతో మళ్లీ ఎలుకల సంచారం మొదలైంది. గతంలో ఓ రోగిని కొరికి చంపిన ఎలుకలు ఇప్పుడు మరోసారి బయటకు రావడంతో రోగులు వారి బంధువులు భయాందోళనకు గురవుతున్నారు.

Read more