ఓట్లు వేయించుకుని, ఫామ్‌హౌస్‌లో పడుకోవడమే

ABN , First Publish Date - 2022-08-25T07:52:46+05:30 IST

‘ఓట్లు వేయించుకోవడం, ఫామ్‌ హౌస్‌లో పడుకోవడం..

ఓట్లు వేయించుకుని, ఫామ్‌హౌస్‌లో పడుకోవడమే

ఎనిమిదేళ్లుగా కేసీఆర్‌ మోసం చేయని వర్గంలేదు: షర్మిల

గద్వాల, ఆగస్టు 24 : ‘ఓట్లు వేయించుకోవడం, ఫామ్‌హౌస్‌లో పడుకోవడం.. ఎనిమిదేళ్లుగా సీఎం కేసీఆర్‌ చేస్తున్న పని ఇదే కదా! ఇలాంటి ముఖ్యమంత్రి మనకు అవసరమా?’ అని వైఎ్‌సఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ప్రశ్నించారు. బుధవారం గద్వాల నుంచి ఎర్రవల్లి వరకు ప్రజాప్రస్థాన పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మోసగించిన కేసీఆర్‌కు వందల మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా చలనం లేదని విమర్శించారు. 

Read more