నేడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో గవర్నర్ తమిళసై పర్యటన

ABN , First Publish Date - 2022-10-01T13:32:21+05:30 IST

నేడు వేములవాడలో సద్దుల బతుకమ్మ వేడుకలు జరుగనున్నాయి. సద్దుల బతుకమ్మ వేడుకలకు గవర్నర్ తమిళ సై హాజరుకానున్నారు.

నేడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో గవర్నర్ తమిళసై పర్యటన

Rajanna Sirisilla: నేడు వేములవాడలో(Vemulawada) సద్దుల బతుకమ్మ వేడుకలు జరుగనున్నాయి. సద్దుల బతుకమ్మ వేడుకలకు గవర్నర్ తమిళ సై(Governor Tamilsai) హాజరుకానున్నారు. వేములవాడ మహిళలకు మాత్రమే మెట్టునింట్లో, పుట్టునింట్లో బతుకమ్మ జరుపునే అవకాశం ఉంది. కావున..శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు కొలువైన క్షేత్రం వేములవాడ. సప్త మాతృకల రూపాల్లో అమ్మవారు దర్శనం ఇస్తారు. అందుకే ఏడు రోజులకే సద్దుల బతుకమ్మను నిర్వహించుకుంటారు. మూలవాగులో సద్దుల బతుకమ్మ కోసం అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేశారు. గవర్నర్ పర్యటన నేపథ్యంలో పోలీసులు ముందస్తుగా అప్రమత్తమై భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.

Read more