virtual meeting: పోలవరంపై ముగిసిన కేంద్ర జలశక్తి శాఖ వర్చువల్ సమావేశం

ABN , First Publish Date - 2022-09-29T19:31:55+05:30 IST

పోలవరంపై కేంద్రజలశక్తి శాఖ వర్చువల్ సమావేశం ముగిసింది.

virtual meeting: పోలవరంపై ముగిసిన కేంద్ర జలశక్తి శాఖ వర్చువల్ సమావేశం

హైదరాబాద్: పోలవరం (Polavaram)పై కేంద్రజలశక్తి శాఖ వర్చువల్ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో తెలంగాణ (Telangana), ఏపీ (Andhrapradesh), ఛత్తీస్‌గఢ్ (Chatishghad), ఒడిశా (Odisha) రాష్ట్రాల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలవరం బ్యాక్‌వాటర్ ఎఫెక్ట్‌పై థర్డ్ పార్టీతో విచారణ జరిపించాలని తెలంగాణ డిమాండ్ చేసింది. ముంపు నివారణ చర్యలు చేపట్టాలని తెలంగాణ నీటి పారుదల శాఖ (Telangana Irrigation Department) కోరింది. ప్రాజెక్ట్ నిర్మాణంలో అనేక మార్పులు జరిగాయని...  దీనితో ముంపు సమస్య కూడా తీవ్రంగా ఉందని కేంద్రజలశక్తి శాఖకు మూడు రాష్ట్రాలు తెలిపాయి. తమ రాష్ట్రాల్లో ఇప్పటివరకు ఎలాంటి ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టలేదని ఒడిశా, ఛత్తీస్‌గఢ్ అభ్యంతరం తెలిపాయి. ఎట్టి పరిస్థితుల్లో పోలవరం ప్రాజెక్ట్ ఎత్తు తగ్గించాల్సిందేనని పట్టుబట్టాయి. ఈ క్రమంలో వచ్చే నెల 7న మరోసారి భేటీ కావాలని కేంద్ర జలశక్తిశాఖ నిర్ణయించింది. 

Updated Date - 2022-09-29T19:31:55+05:30 IST