పేదలకు అండగా సంక్షేమ పథకాలు : చీఫ్‌విప్‌ వినయ్‌భాస్కర్‌

ABN , First Publish Date - 2022-10-15T05:16:30+05:30 IST

పేదలకు అండగా సంక్షేమ పథకాలు : చీఫ్‌విప్‌ వినయ్‌భాస్కర్‌

పేదలకు అండగా సంక్షేమ పథకాలు :  చీఫ్‌విప్‌ వినయ్‌భాస్కర్‌


మట్టెవాడ, అక్టోబరు 14: పేదలకు అండగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమల వుతున్నాయని ప్రభుత్వ చీఫ్‌విప్‌, పశ్చిమ ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్‌ అన్నారు. శుక్ర వారం 11, 29 డివిజన్లకు సంబంధించిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌, లబ్ధిదారుల చెక్కుల పంపిణీ కార్యక్రమం రామన్నపేటలోని బాబు జగ్జీవన్‌రాం మునిసిపల్‌ కమ్యూనిటీహాల్‌లో నిర్వహించారు. కార్పొరేటర్‌ దేవరకొండ విజయలక్ష్మి-సురేందర్‌ అధ్యక్షత జరిగిన కార్యక్రమంలో వినయ్‌భాస్కర్‌, మేయర్‌ గుండు సుధారాణి 33 మందికి చెక్కులను అందజేశారు. చీఫ్‌విప్‌ మాట్లాడుతూ రాజగోపాల్‌రెడ్డి స్వార్థ రాజకీయాల కోసమే మునుగోడు ఉప ఎన్నిక వచ్చిందన్నారు. 11వేల కోట్ల కాంట్రా క్ట్‌లకు రాజగోపాల్‌రెడ్డి అమ్ముడుపోయాడన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 10 లక్షల మందికి పెన్షన్‌ అందజేస్తామని అన్నారు. 

బీజేపీవి మోసపూరిత వాగ్దానాలు

బీజేపీవి మోసపూరిత వాగ్దానాలని మేయర్‌ గుండు సుధారాణి అన్నారు. పెట్రో ల్‌, గ్యాస్‌ ధరలు పెంచి ప్రజలపై ఆర్థిక భారాన్ని మోపిందన్నారు. జన్‌ధన్‌ ఖాతా లో ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా జమ చేయలేదని విమర్శించారు. కార్యక్ర మంలో కార్పొరేటర్‌ వేముల శ్రీనివాస్‌, డిప్యూటీ కమిషనర్‌ జోన, వరంగల్‌ తహసీ ల్దార్‌ శ్రీపాల్‌రెడ్డి, డీఈ రవికుమార్‌, శానిటరి ఇన్‌స్పెక్టర్‌ సంపత్‌రెడ్డి, స్థానిక నాయకులు శివశంకర్‌, మాలకుమ్మరి పరుశురాములు, వాడిక నాగరాజు, గుండు శ్రీనివాస్‌, గట్టు చందు, తాళ్లపెల్లి రమేష్‌ పాల్గొన్నారు.


Updated Date - 2022-10-15T05:16:30+05:30 IST