మా ఊరు మాయమైందంటూ కొద్ది రోజులుగా న్యాయపోరాటం.. పోలీసులు నేడు..

ABN , First Publish Date - 2022-10-01T16:50:47+05:30 IST

సీఎం కేసీఆర్ (CM KCR) పర్యటన నేపథ్యంలో అధికార పార్టీ ప్రజాప్రతినిధులకు సైతం ముందస్తు అరెస్ట్‌లు తప్పడం లేదు.

మా ఊరు మాయమైందంటూ కొద్ది రోజులుగా న్యాయపోరాటం.. పోలీసులు నేడు..

వరంగల్ : సీఎం కేసీఆర్ (CM KCR) పర్యటన నేపథ్యంలో అధికార పార్టీ ప్రజాప్రతినిధులకు సైతం ముందస్తు అరెస్ట్‌లు తప్పడం లేదు. ధరణి పోర్టల్‌ (Dharani Portal)లో తమ వూరు మాయం అయిందని కొద్ది రోజుల నుంచి కేసముద్రం (Kesamudram) మండలం నారాయణపురం గ్రామస్తులు న్యాయ పోరాటం చేస్తున్నారు. నేడు వరంగల్‌లో సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో ఆందోళన చేస్తారని ముందస్తుగా నారాయణపురం ప్రజాప్రతినిధులు, రైతులను కేసముద్రం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టీఆర్ఎస్ పార్టీ (TRS Party)కి చెందిన నారాయణపురం సర్పంచ్, ఉప సర్పంచ్, ఎంపీటీసీతో పాటు మరికొంత మంది రైతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.


Read more