సిద్ధాంతాలని బలిపెడితే అధికారం మూన్నాళ్ల ముచ్చటే.. మహారాష్ట్ర రాజకీయ సంక్షోభంపై Vijayashanti వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2022-06-23T20:47:52+05:30 IST

సిద్ధాంతాలని బలిపెట్టి, అధికారం కోసం అర్రులు చాస్తే అది మూన్నాళ్ళ ముచ్చటగానే మిగులుతుందని ‘మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం’ రుజువు చేసిందని బీజేపీ నేత విజయశాంతి వ్యాఖ్యానించారు.

సిద్ధాంతాలని బలిపెడితే అధికారం మూన్నాళ్ల ముచ్చటే.. మహారాష్ట్ర రాజకీయ సంక్షోభంపై Vijayashanti వ్యాఖ్యలు

హైదరాబాద్ : సిద్ధాంతాలని బలిపెట్టి, అధికారం కోసం అర్రులు చాస్తే అది మూన్నాళ్ళ ముచ్చటగానే మిగులుతుందని ‘మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం(Maharastra political Crisis)’ రుజువు చేసిందని బీజేపీ(BJP) నేత విజయశాంతి(Vijaya Shanti) వ్యాఖ్యానించారు. లోక కల్యాణానికి మూలమైన హిందూ ధర్మాన్ని నిలబెట్టాలనే ఉద్దేశ్యంతో ఉద్ధవ్(Uddav thackeray) తండ్రి బాల్ థాకరే(Bal thackeray)గారు శివసేన(Shivasena) పార్టీ స్థాపించారని ఆమె ప్రస్తావించారు. మహారాష్ట్ర(Maharastra)లో కాంగ్రెస్(Congress), ఎన్సీపీ(NCP)లతో కలసి సంకీర్ణ ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న శివసేన పార్టీలో చోటు చేసుకున్న తిరుగుబాటు పరిణామం ఎంతమాత్రం ఆశ్చర్యం కలిగించడం లేదని అన్నారు. సీఎం ఉద్ధవ్ నాయకత్వంలోని శివసేనలో రెబెల్ ఎమ్మెల్యేల సంఖ్య ఇంకా పెరుగుతుందని అన్నారు. ఈ మేరకు ఫేస్‌బుక్ వేదికగా తన అభిప్రాయాన్ని తెలియజేశారు.


పొత్తులు, సంకీర్ణ సర్కార్లపై బాల్ థాక్రే గారు గతంలో స్పందిస్తూ ఏ పార్టీకి మెజారిటీ ఉందో ఆ పార్టీ మాత్రమే సంకీర్ణ సర్కార్‌కు నేతృత్వం వహించాలని చెప్పారని ఈ సందర్భంగా ఆమె గుర్తుచేశారు. ఉద్ధవ్ ఇవన్నీ తుంగలో తొక్కి, కేవలం అధికారం కోసం తండ్రి వ్యతిరేకించిన పార్టీలతోనే చేతులు కలిపి శివసేనని మలినం చేశారని అన్నారు. చిరకాల మిత్రుడిగా ఉంటూ వచ్చిన బీజేపీని దూరం చేసుకున్నారు. చివరికిప్పుడు సొంత పార్టీవారే తిరుగుబాటు చెయ్యగా... దిక్కులేక సీఎం పీఠాన్ని వదులుకునేందుకు సిద్ధపడాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ఉద్ధవ్‌కి ఇంతకంటే అవమానం మరొకటి ఉండదు. కాంగ్రెస్, ఎన్సీపీలతో కలసి ఉండటం ఎంత ప్రమాదకరమో చివరికి ఏక్‌నాథ్‌ షిండే నాయకత్వంలోని రెబెల్ ఎమ్మెల్యేలు గ్రహించినా ఉద్ధవ్ మేలుకోకపోవడం ఈ పరిస్థితులకి దారితీసిందని వ్యాఖ్యానించారు.

Updated Date - 2022-06-23T20:47:52+05:30 IST