ధరణి ఎందుకు తీసుకొచ్చారో KCRకు అయినా తెలుసా?: VH

ABN , First Publish Date - 2022-07-06T19:37:59+05:30 IST

ధరణి ఎందుకు తీసుకొచ్చారో సీఎం కేసీఆర్‌(CM KCR)కు అయినా తెలుసా? అని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు పేర్కొన్నారు.

ధరణి ఎందుకు తీసుకొచ్చారో KCRకు అయినా తెలుసా?: VH

Hyderabad : ధరణి ఎందుకు తీసుకొచ్చారో సీఎం కేసీఆర్‌(CM KCR)కు అయినా తెలుసా? అని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు పేర్కొన్నారు. దొరలకు లాభం చేసేందుకే ధరణి అని పేర్కొన్నారు. దున్నేవాడికి భూమి ఇచ్చిన ఘనత ఇందిరా గాంధీ(Indira Gandhi)దేనన్నారు. ఓఆర్ఆర్ వచ్చిన తర్వాత భూముల రేట్లు విపరీతంగా పెరిగాయని వీహెచ్ పేర్కొన్నారు. ఓఆర్ఆర్ చుట్టూ ఉన్న పేదల భూములను పెద్దలకు రాసిచ్చారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే లోపు ఉన్న భూములు మాయం చేస్తారన్నారు. ఎల్లుండి హెచ్‌ఎండీఏ ముందు నిరసన చేస్తామని వీహెచ్ పేర్కొన్నారు.

Read more