మానవత్వంతో ఆలోచించండి.. రూ.5 లక్షల పరిహారం సరిపోదు: వీహెచ్

ABN , First Publish Date - 2022-03-23T16:25:40+05:30 IST

హైదరాబాద్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో 11 మంది కూలీలు సజీవ దహనమవడం అత్యంత విషాదకరమని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు తెలిపారు.

మానవత్వంతో ఆలోచించండి.. రూ.5 లక్షల పరిహారం సరిపోదు: వీహెచ్

ఢిల్లీ : హైదరాబాద్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో 11 మంది కూలీలు సజీవ దహనమవడం అత్యంత విషాదకరమని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్క కూలీ కుటుంబానికి రూ.25 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలన్నారు. స్థానిక శాసన సభ్యుడు కూడా రూ.5 లక్షలు ఇచ్చి చనిపోయిన వారి కుటుంబాలను ఆదుకోవాలని వీహెచ్ డిమాండ్ చేశారు. తెలంగాణలో నిర్మాణంలో ఉన్న ఫ్యాక్టరీలు, ప్రాజెక్ట్‌లలో బీహార్ కూలీల శ్రమ వెలకట్టలేనిదన్నారు. తెలంగాణలో ఉన్న ఐఏఎస్, ఐసీఎస్ అధికారులు ముందుకు వచ్చి ఆదుకోవాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే 5 లక్షల నష్ట పరిహారం సరిపోదన్నారు. రాజకీయంగా కాకుండా మానవతా దృక్పధంతో ఆలోచించి, ప్రమాదంలో చనిపోయిన కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలని వీహెచ్ కోరారు.

Read more