Vh Comments On Kcr New Party: సీఎం కేసీఆర్ కొత్త పార్టీపై వీహెచ్ ఏమన్నారంటే..

ABN , First Publish Date - 2022-09-10T03:51:31+05:30 IST

సీఎం కేసీఆర్ కొత్త పార్టీ బీఆర్ఎస్‌పై కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు...

Vh Comments On Kcr New Party: సీఎం కేసీఆర్ కొత్త పార్టీపై వీహెచ్ ఏమన్నారంటే..

హైదరాబాద్ (Hyderabad): సీఎం కేసీఆర్ కొత్త పార్టీ బీఆర్ఎస్‌పై కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు (V Hanumanth Rao) స్పందించారు. సీఎం కేసీఆర్ (Cm Kcr) కొత్త పార్టీ పెడితే బీజేపీ (Bjp)కి లాభం అవుతుందని ఆయన చెప్పారు. నితీష్ కుమార్ (Nitish Kumar), మమత బెనర్జీ (Mamata Benarjee), శరత్ పవర్ (Sharad Pawar) కూడా బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతున్నారన్నారు. రాజకీయ శక్తులను కేసీఆర్ ఒక్కటి చేయాలని.. అప్పుడే బీజేపీతో ఫైట్ చేయొచ్చని తెలిపారు. గతంలో సీఎం ఫెడరల్ ఫ్రంట్ అన్నారని.. అది ఏమైందని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ ఆలోచనలో మార్పు రావాలన్నారు. గురుకులాల్లో సరైన వసతులు లేవని.. పిల్లలు ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పసి పిల్లలు తాగే పాలపై కూడా కేంద్రం జీఎస్టీ (GST) వేస్తోందని వీహెచ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Read more