రాహుల్ రాష్ట్ర పర్యటన ఎందుకంటే...: ఉత్తమ్

ABN , First Publish Date - 2022-04-25T01:13:01+05:30 IST

రాహుల్ రాష్ట్ర పర్యటన ఎందుకంటే...: ఉత్తమ్

రాహుల్ రాష్ట్ర పర్యటన ఎందుకంటే...: ఉత్తమ్

హైదరాబాద్: రైతుల సమస్యలను సీఎం కేసీఆర్‌ పట్టించుకోవడం లేదని  కాంగ్రెస్ సీనియర్ నేత ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మండిపడ్డారు. రైతులకు భరోసా కల్పించేందుకే రాహుల్ గాంధీ రాష్ట్రంలో పర్యటించనున్నారని ఆయన ఓ ప్రకటనలో తెలిపారు. తెలంగాణలో రైతులకు పూర్తి స్థాయిలో రుణమాఫీ జరగడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు ఉచిత ఎరువులు ఇస్తామని కేసీఆర్‌ మోసం చేశారని ఆరోపించారు. రైతులకు పంట నష్టపరిహారం కూడా ఇవ్వడం లేదన్నారు. సీఎం కేసీఆర్ వైఖరి వల్లే రైతులు నష్టపోతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు సీఎం కేసీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. 

Read more