సీఎం కేసీఆర్‌పై కేంద్రమంత్రి Kishan reddy ఫైర్

ABN , First Publish Date - 2022-07-15T19:45:35+05:30 IST

ముఖ్యమంత్రి కేసీఆర్‌(KCR)పై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి(Kishan reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు.

సీఎం కేసీఆర్‌పై కేంద్రమంత్రి Kishan reddy ఫైర్

హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్‌(KCR)పై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి(Kishan reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ... టీఆర్ఎస్(TRS) పీఠాలు కదిలిపోతున్నాయి కాబట్టే.. బీజేపీ(BJP)పై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. తెలంగాణ ప్రజలపై కేసీఆర్ నియంతృత్వ పాలన సాగిస్తున్నారని విమర్శించారు. పార్లమెంట్ ఉన్నది యుద్ధాలు చేసేందుకు కాదని.. ప్రజాసమస్యలపై చర్చించేందుకని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వంతో అగ్రిమెంట్ చేసుకున్న ప్రకారం వరి కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ నివేదిక ఆధారంగా కేంద్ర బృందాలు పర్యటిస్తాయని... వారి రిపోర్టుల ఆధారంగా వరద సాయం అందిస్తామని కిషన్‌రెడ్డి తెలియజేశారు. 

Read more